Top Heroine: బాలీవుడ్ హీరోయిన్ వెనక్కి నెట్టిన సమంత.. రష్మికకు షాక్.. టాప్ 10 హీరోయిన్లు ఎవరెవరంటే??

సమంతా రూత్ ప్రభు.. సింపుల్‌గా సమంత. దాదాపు 15 ఏళ్లుగా స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న ఆమె స్టార్ హీరోలతో సమానమైన పాపులారిటీ , క్రేజ్‌తో దూసుకెళ్తున్నారు. తనతో పాటు కెరీర్ ప్రారంభించిన వారంతా ఇప్పటికే పెళ్లి చేసుకుని ఫేడ్ అవుట్ అవ్వగా.. సామ్ మాత్రం మోస్ట్ వాంటెడ్ స్టార్‌గా దూసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సమంత అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ఈ వివరాల్లోకి వెళితే..

సినిమాలతోనే కాక.. పర్సనల్ లైఫ్‌తోనూ ఎన్నోసార్లు వార్తల్లో నిలిచారు సమంత . తనపై ఎన్ని కామెంట్స్ వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగుతూ ఇన్స్‌పిరేషన్‌గా నిలిచారు. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్యతో కలిసి నటించిన ఏమాయ చేశావేతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు సమంత . ఆ వెంటనే ఎన్టీఆర్, మహేశ్ బాబు , పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్నారు.

Samantha Ruth Prabhu Top Heroine over Alia Bhatt in Ormax Survey in August 2024

ఒకానొక దశలో సామ్ పట్టిందల్లా బంగారమైంది. ఆమె ఏ సినిమాలో నటిస్తే ఆ సినిమా బ్లాక్ బస్టర్ అన్న సెంటిమెంట్ బలపడి లక్కీ హ్యాండ్‌గా నిలిచింది. తెలుగులో వచ్చిన స్టార్‌డమ్‌తో కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. అజిత్, విజయ్, సూర్య, విశాల్, కార్తీ వంటి హీరోలతో నటించి సౌత్‌లో తిరుగులేని హీరోయిన్‌గా నిలిచింది. కెరీర్ పీక్స్‌లో ఉన్న దశలోనే తన సహనటుడు, హీరో అక్కినేని నాగచైతన్యని 2017లో ప్రేమ వివాహం చేసుకున్నారు సామ్.

అయితే నాలుగేళ్లు తిరిగేసరికి వ్యక్తిగత కారణాలతో సమంత - నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించడంతో చిత్ర పరిశ్రమ ఉలిక్కిపడింది. వీరు ఏ కారణం చేత విడిపోయారన్నది ఇప్పటికీ మిస్టరీయే . ఇప్పటికీ దీని గురించి మీడియాలో రకరకాల కథనాలు వస్తూనే ఉన్నాయి. చైతూతో విడిపోయి డిప్రెషన్‌లోకి వెళ్లిన సామ్‌ను మయోసైటిస్ మరింత కృంగదీసింది. తెలుగులో చివరిసారిగా ఖుషిలో కనిపించారు సమంత. ప్రస్తుతం బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్‌తో సిటాడెల్ హనీ బన్నీ నవంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల అక్కినేని నాగచైతన్య- శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్ధం నేపథ్యంలో సమంత పేరు వార్తల్లో ఎక్కువగా వినిపిస్తోంది.

ఈ క్రమంలో సమంత ఓ అరుదైన ఘనతను అందుకున్నారు. ఆగస్ట్ నెల వరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ ఫిమేల్ స్టార్స్ ఎవరంటూ ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా అనే సంస్థ సర్వే నిర్వహించింది. ఇందులో సమంత అగ్రస్థానంలో నిలిచారు. ఆమె తర్వాత అలియా భట్, దీపిక పదుకొనె, నయనతార, కాజల్ అగర్వాల్, శ్రద్ధా కపూర్, త్రిష, కత్రినా కైఫ్, రష్మిక మందన్న, కియారా అద్వానీ నిలిచారు. నిన్న మొన్నటి వరకు ఈ లిస్ట్‌లో టాప్‌లో నిలిచిన రష్మిక.. కనీసం టాప్ 5లో చోటు దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుతం ఓర్మాక్స్ స్టార్స్ ఇండియా లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

More from Filmibeat

Read more about: samantha heroine ormax media
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X