Top Heroines: ఇండియాలో టాప్ 10 హీరోయిన్లు ఎవరో తెలుసా? రష్మిక, దీపికను బీట్ చేసిన సమంత!
దక్షిణాది సినిమా దగ్గర ఉన్న టాప్ మోస్ట్ హీరోయిన్స్ లో స్టార్ బ్యూటీ సమంత కూడా ఒకరు. అయితే సమంత ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. గత 2023 లో చివరగా తన నుంచి తెలుగులో సినిమా వచ్చింది. అక్కడ నుంచి సైలెంట్ గానే ఉన్న సమంత ఈ మధ్య ఒక వెబ్ సిరీస్ తో పలకరించింది.
ఇక ఈ సిరీస్ కాకుండా మరో భారీ సిరీస్ తుంబాడ్ దర్శకుడు అనీల్ రాహి బార్వేతో రక్త బ్రహ్మాండ్ చేస్తుంది. ఇలా కొన్నాళ్లపాటుగా సినిమాలు కు దూరంగానే ఉన్న సమంత ఈ మధ్యలో ఏ భాషలో కూడా కొత్త సినిమాని అనౌన్స్ చేసింది లేదు. అయినప్పటికీ సమంత నెంబర్ వన్ స్థానంలో అది కూడా ఇండియా వైడ్ గా నిలవడం అనేది ఒక ఎంత షాకింగ్ గా మారింది.

ప్రముఖ సర్వే సంస్థ ఆర్మాక్స్ మీడియాలో గత నెల ట్రెండింగ్, మోస్ట్ పాపులర్ టాప్ 10 హీరోయిన్స్ లో ఒక హీరోయిన్ గా అది కూడా నంబర్ వన్ ప్లేస్ లో నడవడం వైరల్ గా మారింది. దీంతో సమంత ఫ్యాన్స్ కొంచెం హ్యాపీగానే ఉన్నారు కానీ అసలు ఎలాంటి సినిమాలు చేయకుండా ఇప్పటికీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం అనేది ఇంకొందరికి సందేహంగా మారుతుంది.
అయితే కొన్నాళ్ల క్రితం సమంత ఇలా ట్రెండింగ్ లో ఉండేందుకు డబ్బులు కూడా ఖర్చు పెడుతుందని కొన్ని రూమర్స్ వచ్చాయి. కాగా ఇప్పుడు మళ్ళీ తన పేరు వైరల్ గా మారడంతో మళ్లీ ఆ సందేహాలు మొదలయ్యాయి. మరి లైమ్ లైట్ లో లేనప్పటికీ సమంత ఇప్పటికీ టాప్ లో కనిపించడం అది కూడా బాలీవుడ్ హీరోయిన్స్ ని సైతం దాటి అంటే డెఫినెట్ గా తనే తన స్థానాన్ని మ్యానేజ్ చేస్తుందా అని చెప్పక తప్పదు.
ఇక ఇవి పక్కన పెడితే సామ్ నుంచి శుభం అనే ఓ సినిమా తన నిర్మాణంలో వచ్చిన చిత్రం విడుదలకి రాబోతోంది. అలాగే తన నిర్మాణం లోనే మరిన్ని సినిమాలు రాబోతుండగా హీరోయిన్ గా మాత్రం సామ్ ఇప్పటికీ ఏ సినిమా ఓకే చేయలేదు ప్రస్తుతానికి అన్నీ చర్చల్లోనే ఉన్నాయని వినిపిస్తోంది.
ఇక వీటితో పాటుగా సమంత నుంచి ఓ బిగ్ సిరీస్ సీక్వెల్ సిటాడెల్ హనీ బన్నీ మిస్ అయ్యినట్టే పలు పుకార్లు కూడా ఉన్నాయి. ఇంకోపక్క తెలుగులో మాత్రం తనకి బిగ్ ఆఫర్స్ వస్తున్నట్టే వినిపిస్తోంది. మరి సమంత నుంచి ఒక స్ట్రాంగ్ కం బ్యాక్ ని అయితే తెలుగు ఆడియెన్స్ గట్టిగా కోరుకుంటున్నారు. మరి సామ్ మళ్లీ ఎపుడు తెలుగులో బిజీగా మారి తానేంటో చూపిస్తుందో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











