Samantha చేతికి గాయాలు.. రక్తం కనిపించేలా షాకింగ్ ఫొటో!
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న సమంత ఇటీవల మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం తెలిసిందే. ఇక సమస్య నుంచి బయటపడేలా ఫిట్ నెస్ పై దృష్టి పెట్టింది. సమంత ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ ని ఫినిష్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఆమె ఊహించని విధంగా గాయలపాలవుతోంది. సమంత షేర్ చేసిన ఒక ఫొటోలో ఆమె చేతికి గాయలు రక్తపు మరకలు కూడా ఉన్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

యాక్షన్ క్వీన్
సమంత ఇటీవల యాక్షన్ క్వీన్ గా మారడానికి బాక్సింగ్ ప్రాక్టీస్ చేసింది. గుర్రపుస్వారీ కూడా చేసింది. ఎందుకంటే రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్ తర్వాత సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేయడానికి ఒకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ని తాజాగా సమంత స్టార్ట్ చేసింది. అందుకోసం ఆమె ప్రతీసారి షూట్ కు ముందు వర్క్ షాప్ లో పాల్గొంటోంది. ప్రతీ సీన్ కొత్తగా ఉండేలా దర్శకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పాన్ ఇండియా సీరీస్
హాలీవుడ్ వెబ్ సిరీస్ ఆధారంగా సిటాడెల్ ని పాన్ ఇండియా భాషలలో నిర్మిస్తున్నారు. ఇక సమంత లీడ్ రోల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ సీక్వెల్ లో హాలీవుడ్ లో ప్రియాంకా చోప్రా నటిస్తోంది. ఆమె పాత్రలోనే తెలుగులో సమంత నటిస్తూ ఉండటం విశేషం. ఇక అంచనాలు పెరిగేలా షూటింగ్ అప్డేట్స్ వదులుతున్నారు. అంతే కాకుండా సమంత బాలీవుడ్ లో క్రేజ్ పెంచుకునేందుకు ఇదే బెస్ట్ ఛాయిస్ అని ఆమె చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

సమంత కష్టం
ఇక ఈ వెబ్ సిరీస్ లో సమంతతో పాటు వరుణ్ ధావన్ కూడా నటిస్తున్నాడు. వీరిద్దరి కాంబినేషన్ లో యాక్షన్ సీక్వెన్స్ అద్బుతంగా ఉంటాయని తెలుస్తుంది. ఇక దీనికోసమే సమంత చాలా కష్టపడింది. అయితే షూటింగ్ లో పాల్గొని ఇప్పుడు చేతులకి గాయాలు చేసుకుంది. ఈ నేపధ్యంలోస షూటింగ్ కి గ్యాప్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

చేతులకు గాయాలు
షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్న సమయంలో సమంత ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని ఆమె ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోలు షేర్ చేసి తెలియజేసింది. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది. అంతబలమైన గాయాలు కాకపోయిన చేతులకి బ్లడ్ రావడంతో కొంత రెస్ట్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.

విజయ్ దేవరకొండతో ఖుషి
ఇదిలా ఉంటే విజయ్ దేవరకొండకి జోడీగా సమంత ఖుషి అనే సినిమా చేస్తోంది. శివనిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ మార్చి నుంచి మొదలు కాబోతుంది. ఆ షూటింగ్ లో కూడా సమంత పాల్గొనాల్సి ఉంది. అయితే సిటాడెల్ షూటింగ్ లో బిజీగా ఉండడం వలన ఖుషి ప్రాజెక్ట్ లో సమంత కొంత ఆలస్యంగా జాయిన్ అయ్యే అవకాశం ఉందట.


Click it and Unblock the Notifications











