విడాకుల ప్రకటన తరువాత మొట్టమొదటి సారి తిరుమలలో సమంత.. షాకింగ్ లుక్ లో అలా!
ఏం మాయ చేశావో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సమంత.. ఆ తర్వాతే అదే సినిమాతో పరిచయమైన నాగచైతన్యను వివాహం చేసుకొని తెలుగింటి కోడలిగా మారిన సంగతి తెలిసిందే. అయితే పదేళ్ల ప్రేమబంధం.. నాలుగేళ్ల వివాహబంధాన్ని తెగతెంపులు చేసుకుంటూ సమంత, నాగ చైతన్య సంచలన ప్రకటన కూడా చేశారు. అయితే విడాకుల ప్రకటన తర్వాత మొట్టమొదటసారిగా ఆమె తిరుమలలో కనిపించింది. ఆ వివరాల్లోకి వెళితే

విడిపోయినట్టు ప్రకటన
అక్టోబర్ 2న అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ ఇక విడివిడిగా ప్రయాణం మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య స్పెషల్ బాండ్ కొనసాగుతుందనీ, తమ ప్రైవసీని గౌరవించి తమకు అండగా నిలవాలంటూ అభిమానులు, శ్రేయోభిలాషులు, మీడియాకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు.
అయితే ఈ ప్రకటన చేయడానికి ముందు సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం ముగించుకొని బయటకు రాగానే అక్కడే ఉన్న మీడియా వారు ఆమెతో మాట్లాడడానికి ఆసక్తి చూపించారు. ఈ క్రమంలోనే ఓ మీడియా ప్రతినిధి మాట్లాడుతూ.. 'మీరు విడాకులు తీసుకోబోతున్నట్లు రూమర్స్ వస్తున్నాయి' నిజమేనా అంటూ ప్రశ్నించాడు.

అప్పుడు షాక్
ఈ దెబ్బకు ఒక్కసారిగా సీరియస్ అయిన సామ్.. 'గుడిలో ఇలాంటి ప్రశ్నలు అడగడం ఏంటి.? అసలు బుద్ధి ఉందా.?' అంటూ ఘూటుగా స్పందించింది. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా సైలంట్ అయ్యారు. అయితే అప్పుడు చివరి సారిగా తిరుమల వెళ్లిన ఆమె విడాకుల ప్రకటన తరువాత ఆమె మొట్టమొదటసారిగా తిరుమలలో కనిపించింది. శనివారం నాడు ఆమె తిరుమలకు నడక దారిలో వెళ్లి స్వామిని దర్శించుకున్నారు. ఆమె పర్పుల్ కలర్ కఫ్తాన్ డ్రెస్‌తో సింపుల్‌గా కనిపించింది.

సాధారణ భక్తులలాగే
సుప్పథం ప్రవేశమార్గంలో ఆలయానికి చేరుకున్న ఆమె సాధారణ భక్తులతో పాటు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. అంతకు ముందు సాయంత్రం ఆమె శ్రీకాళహస్తిలో జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అటు నుంచి ఆమె తిరుమల బయలుదేరి వెళ్లారు.

వార్తల్లో నిలుస్తూ
నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న కారణంగా ఆమె రకరకాల కారణాలతో వార్తల్లో నిలుస్తోంది. ఆమె పుష్ప నుండి తన తొలి ఐటెం సాంగ్ లిరికల్ వీడియో విడుదలైన తర్వాత బ్యాక్ టు బ్యాక్ కొత్త సినిమా ప్రకటనలతో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకోవడానికి చూస్తోంది. ఇటీవలి కాలంలో సమంత విడాకుల గురించి కూడా మాట్లాడింది. ఆమె ఎలా నిరాశకు గురయిందో వెల్లడించింది. విడాకుల తర్వాత తాను చనిపోతానని అనుకున్నానని ఆమె వెల్లడించింది.. ''మేమిద్దరం విడిపోవడం గురించి చాలా మంది భిన్నంగా ఆలోచిస్తారు. ఆ మొత్తం వ్యవహారంపై ఇప్పటికే నా అభిప్రాయం చెప్పాను. కాబట్టి, ఇప్పుడు మళ్లీ మళ్లీ దానిపై స్పందించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాననీ పేర్కొంది.
Recommended Video

వరుస సినిమాలతో
ఇక త్వరలోనే సమంత.. గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో విజయ్ సేతుపతితో కలిసి ఓ సినిమా చేస్తుంది. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ తెరకెక్కించిన రాజ్ అండ్ డీకేతో మరో సిరీస్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఓ ఛాలెంజింగ్ పాత్రతో హాలీవుడ్లో కూడా ఆమె అడుగుపెట్టనుంది. ఇక ఈసారి పెద్దగా మీడియా ప్రతినిధులు సమంత వెంటపడడం అయితే కనిపించలేదు.


Click it and Unblock the Notifications











