Samantha Ruth Prabhu: మరోసారి ఆస్పత్రిలో చేరిన సమంత, టెన్షన్ పడిపోతున్న అభిమానులు!

Samantha Ruth Prabhu: ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన సమంత.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. తన అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించి తెలుగు సినీ ప్రేక్షుకల గుండెల్లో గూడు కట్టుకుంది. గతంలో టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగిన ఈ ముద్దుగుమ్మ కెరియర్ ఈ మధ్య కాలంలో ఏమంత ఆశాజనకంగా లేదు. ముఖ్యంగా ఆమె ప్రధాన పాత్రలో వచ్చిన శాకుంతలం సినిమా దారుణమైన ఫలితాన్ని అందుకోగా.. ఖుషీ కూడా అదే స్థాయిలో నిలిచింది. అనుకున్న స్థాయిలో ఆ చిత్రం ఆడలేకపోయింది. ఈ రెండు సినిమాలు సమంతకు మైనస్ గా మారిపోయాయి.

గత కొన్ని నెలలుగా సమంత మయోటైటిస్ తో బాధ పడుతోంది. ఓవైపు ఆరోగ్యం బాగాలేకపోయినా ఖుషీ, శాకుంతలం సినిమాల్లో నటించింది. ఖుషీ సినిమాకు మధ్య మధ్యలో బ్రేకులు తీసుకుంటూనే సినిమాను పూర్తి చేసింది. కానీ ఆ తర్వాత నుంచి సమంత ఆరోగ్యం మరింత క్షీణించడం.. సినిమాలకు కొంత కాలం బ్రేక్ ఇవ్వబోతున్నట్లు చెప్పి అందరినీ షాక్ కు గురి చేసింది. సినిమాలు చేయకపోయినా తనకు సంబంధించిన అన్ని విషయాలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ అన్నీ చెబుతుంది.

Samantha Ruth Prabhu Was Once Again Admitted in The Hospital And Her Latest Instagram Post Viral

తాజాగా ఈ క్యూట్ బ్యూటీ ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టింది. అందులో ఆస్పత్రిలో ఉన్న సమంత సెలైన్ పెట్టుకుని కనిపిచింది. మందుల వల్ల తనకు కల్గే ప్రయోజనాల గురించి వివరిస్తూ.. ఆ ఫొటోపై రాసుకొచ్చారు. తనకు ఈ డ్రిప్సే ఇమ్యూనిటీని అందిస్తాయని... రక్త కణాల ఉత్పత్తి, రోగ నిరోధక శక్తి పెరుగుదల, హృదయ సంరక్షణ, కండరాల శక్తి, వైరస్ లకు వ్యతిరేకంగా పోరాడే శక్తి, హృదయానికి రక్త సరఫరా, ఎముకల బలహీనత పోగొట్టేందుకు ఉపయోగపడాయంటూ వెల్లడించింది. తాను షేర్ చేస్తున్న ఈ పోస్టు చూసి అభిమానులు కంగారు పడొద్దని కూడా వివరించింది.

తన ఆరోగ్యం బాగానే ఉందని.. కానీ తాను రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఇలా సెలైన్ ఎక్కించుకుంటున్నట్లు ఇన్ స్టాగ్రామ్ వేదికగా చెప్పుకొచ్చారు. ఈ పోస్ట్ చూసిన సామ్ అభిమానులు అంతా తెగ టెన్షన్ పడుతున్నారు. సమంత ఆరోగయ్యం త్వరగా బాగవ్వాలని కోరుకుంటున్నట్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే మీ ఆరోగ్యం బాగవుతుందని చెబుతూ.. సామ్ కు ధైర్యాన్ని ఇస్తున్నారు.

Samantha Latest Instagram Post

మరోవైపు సామ్ ప్రస్తుతం ఎలాంటి కొత్త ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు. గతంలో ఓకే చెప్పిన సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో మాత్రమే నటిస్తోంది. ఈ ప్రాజెక్టు కూడా దాదాపుగా పూర్తి అయిందట. హిందీ హీరో వరుణ్ ధావన్ కు జోడీగా స్టార్ హీరోయిన్ సమంత రూతు ప్రభు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ హాలీవుడ్ దర్శకులు రూసో బ్రదర్స్ తీసిన సిటాడెల్ కు ఇది ఇండియన్ వెర్షన్. అయితే త్వరలోనే ఈ వెబ్ సిరీస్ విడుదల కాబోతుంది. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సామ్ 10 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X