నాగచైతన్య గుర్తుగా సమంత దాచుకున్నది ఏంటో తెలుసా? అదేంటంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య సరసన తన తొలి చిత్రం ఏమాయ చేసావేతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సమంత కెరీయర్ ఎలా సాగిందో అందరికీ తెలిసిందే. అయితే సమంత నాగచైతన్యలు ఆ చిత్రంతోనే ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం వారు విడిపోయి సెపరేట్ గా ఎవరి లైఫ్ ను వాళ్లు లీడ్ చేస్తున్నారు. కానీ వీరి గురించి ఎప్పుడూ ఏదోక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతూనే ఉంది. ఇక తాజాగా సమంత నాగ చైతన్య గుర్తుకు దాచుకున్నదేంటో వెలుగులోకి వచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

7 ఏళ్ల ప్రేమ.. 4 ఏళ్లకే విడాకులు..
సమంత రూత్ ప్రభు - అక్కినేని నాగచైతన్య పెళ్లి 2017లో జరిగింది. అంతకు ముందే వీరిద్దరూ డీప్ లవ్ లో మునిగి తేలారు. 2010లో విడుదలైన ఏమాయ చేసావే చిత్రంతోనే వీరద్దరి మధ్య స్వచ్ఛమైన ప్రేమ చిగురించింది. దాంతోనే 7 ఏళ్లు ప్రేమలో మునిగి తేలాక, జీవితం మీద ఒక అవగాహన తెచ్చుకుని మరీ మూడు ముళ్ల బంధంలో అడుగు పెట్టారు. పంచభూతాల సాక్షిగా ఒక్కటయ్యారు. టాలీవుడ్ లో లవ్ బర్డ్స్ గా వీరిద్దరూ స్ఫూర్తిని నింపారు. అయితే వీరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ 2021 అక్టోబర్ 2న వీరిద్దరూ విడిపోయారు. ఆ వార్త అప్పట్లోనే కాదు ఇప్పటికీ సంచలనంగానే ఉంటుంది. ఇప్పటికీ సమంత చైతూ విడిపోయి నాలుగేళ్లు కావొస్తున్న అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

Samantha Ruth Prabhu Wedding dress is still with her

గుర్తులను చెరిపేసిన సమంత..
కరోనా టైమ్ లోనే నాగ చైతన్య సమంత మధ్య మనస్పర్థాలు రావడంతో సెపరేట్ కావాలని భావించారు. అదే సమయంలో 2021 జూలై 31న సమంత రూత్ ప్రభు తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లోని పేరుకు ఉన్న ఇంటి పేరు అక్కినేనిని తీసేసింది. దాంతో రూమర్లు పుట్టుకొచ్చాయి. అనుకుంటున్నట్టుగానే విడిపోయారు. ఇక అప్పటి నుంచి వరసగా చైతన్య గుర్తులను తొలగిస్తూ వస్తోంది. సోషల్ మీడియాలోని ఫొటోలు, వీడియోలతో పాటు తన దగ్గర ఉన్న అన్నీ వస్తువులను దూరం చేసింది. అలాగే తన ఒంటిపై ఉన్న పచ్చబొట్టును కూడా తీయించేసుకుంది.

అదొక్కటి మాత్రం చైతన్య గుర్తుగా..
ఇక సమంత రూత్ ప్రభు నాగచైతన్య గుర్తుగా ఒకటి మాత్రం ఉంచుకుందని అంటున్నారు. అది కూడా తమ పెళ్లికి సంబంధించిన డ్రెస్ కావడం విశేషం. అయితే తన వెడ్డింగ్ డ్రెస్ ను బ్లాక్ కలర్ లో డిజైన్ చేయించుకుందని ఆ మధ్య వార్తలు వచ్చాయి. చైతన్యపై రివేంజ్ తో ఆ డ్రైస్ ను అలా రీడిజైన్ చేయించిందని టాక్ వచ్చింది.

కానీ తాజాగా ప్రముఖ డిజైనర్ క్రేషా బజాజ్ దీనిపై స్పందించారు. సమంత ఆ డ్రెస్ ను గతాన్ని మర్చిపోవాలని అలా రీడిజైన్ చేయించుకోలేదని, ఆ డ్రెస్ తో తనకు కొత్త ఎమోషన్ ను క్రియేట్ చేసుకుందని, కొత్త జర్నీకి, తనలోని కొత్త సామర్థ్యాన్ని తెలిపేలా అలా డిజైన్ చేసుకుందని అన్నారు. ఇప్పటికీ ఆ డ్రెస్ తనతోనే ఉండటం విశేషం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X