For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాగచైతన్యతో బ్రేకప్ రూమర్లు.. మరోసారి సమంత ట్వీట్.. వైరల్‌ అవుతున్న కామెంట్!

  |

  అక్కినేని వారసుడు నాగచైతన్య, సమంత దాంపత్య జీవితంలో విభేదాలు తలెత్తాయనే రూమర్లు గత కొద్దికాలంగా మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే వారి కాపురంలో సమస్యలు నెలకొన్నాయా అనే విషయం గాసిప్స్‌కే పరిమితయ్యాయి కానీ.. అధికారికంగా ఎలాంటి వివరణ గానీ, కామెంట్లు వారిద్దరి నుంచి రాలేదు. అయితే ఇలాంటి రూమర్ల మధ్య నాగచైతన్య చేసిన ఓ ట్వీట్‌కు సమాధానం ఇస్తూ సమంత ట్వీట్ చేయడం ఇప్పుడు మరింత చర్చనీయాంశమైంది. అయితే సమంత చేసిన ట్వీట్ వైరల్‌గా ఎందుకు మారిందంటే..

  Uttej Wife Padmathi కన్నుమూత: విషాదంలో సినీ ప్రముఖులు.. చిరంజీవి, ప్రకాశ్ రాజ్ కంటతడి (ఫోటోలు)

  లవ్ స్టోరి ట్రైలర్‌ నేపథ్యంలో

  లవ్ స్టోరి ట్రైలర్‌ నేపథ్యంలో

  దర్శకుడు శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో నాగచైతన్య, సాయి పల్లవి నటించిన లవ్ స్టోరి చిత్రం సెప్టెంబర్ 24వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దమైంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌‌ను సెప్టెంబర్ 13 తేదీన రిలీజ్ చేయగా.. మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకొన్నది. ఈ చిత్రంలోని ఫీల్ గుడ్ సన్నివేశాలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.

  హాట్ ఫొటోలతో రెచ్చిపోయిన అనసూయ భరద్వాజ్: అదిరిపోయే ఫోజులతో అందాల విందు

  గంటలోనే 1 మిలియన్ వ్యూస్

  గంటలోనే 1 మిలియన్ వ్యూస్

  లవ్ స్టోరీ సినిమా ట్రైలర్‌లో నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి చెందిన రేవంత్‌గా ఓ మిడిల్ క్లాస్ కుర్రాడిగా కనిపించాడు. లోన్ తీసుకొని బిజినెస్ చేయడం ద్వారా లైఫ్‌లో సెటిల్ అవ్వాలనుకునే డ్యాన్సర్ రేవంత్‌గా నాగచైతన్య‌ను చూపించారు. బీటెక్ పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్‌వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి పల్లవి కనిపించింది. ఫీల్‌గుడ్ చిత్రంగా కనిపిస్తున్న ఈ థియేట్రికల్ ట్రైలర్ రిలీజైన కొద్ది గంటల్లోనే 1 మిలియన్ వ్యూస్ సాధించింది.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  సాయిపల్లవి ఎమోషనల్‌గా ట్వీట్

  సాయిపల్లవి ఎమోషనల్‌గా ట్వీట్

  లవ్ స్టోరి థియేట్రికల్ ట్రైలర్‌కు వస్తున్న ట్రైలర్ గురించి సాయిపల్లవి ట్వీట్ చేస్తూ.. ఎంత టైమ్ తీసుకొన్నా.. మా సినిమా మీద మీ ప్రేమ మాత్రం తగ్గలేదు. నాకు చాలా సంతోషంగా ఉంది. మీతో మన ట్రైలర్ షేర్ చేస్తున్నందుకు ఆనందంగా ఉంది. రేవంత్, మౌని లవ్ స్టోరీని ఈ సారి డెఫినెట్‌గా సెప్టెంబర్ 24న థియేటర్లలో చూస్తారు అని సమంత ట్వీట్ చేసింది.

  ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర హీరో గోపిచంద్ సందడి.. సీటీమార్ అంటూ..

  లవ్ స్టోరి ట్రైలర్‌ను ట్వీట్ చేసిన నాగచైతన్య

  లవ్ స్టోరి ట్రైలర్‌ను ట్వీట్ చేసిన నాగచైతన్య

  లవ్ స్టోరి సినిమా ట్రైలర్‌ రిలీజ్ తర్వాత నాగచైతన్య ఓ పోస్టు పెట్టారు. లవ్ స్టోరి సినిమాను, ట్రైలర్‌ను మీ ముందుకు తీసుకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మళ్లీ మీ అందర్ని సినిమా థియేటర్లలో చూడటానికి చాలా ఉత్సాహంగా ఉంది అంటూ చైతూ థియేట్రికల్ ట్రైలర్‌ను షేర్ చేశారు.

  చిరంజీవి ఇంట్లో యంగ్ హీరో సందడి: మెగాస్టార్ బొమ్మ ఉన్న షర్ట్ వేసుకుని మరీ రచ్చ చేసేశాడుగా!

  సమంత హాట్ కామెంట్

  నాగచైతన్య షేర్ చేసిన లవ్ స్టోరి థియేట్రికల్ ట్రైలర్ ట్వీట్‌పై సమంత అక్కినేని సోషల్ మీడియాలో స్పందించారు. విన్నర్ అంటూ కామెంట్ చేసింది. లవ్ స్టోరి సినిమా యూనిట్‌కు సాయిపల్లవికి ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే నాగచైతన్య గురించి ఎలాంటి కామెంట్ చేయకపోవడం అందర్నీ మళ్లో సందిగ్ధంలో పడేసింది.

  Actor / Assistant Director Swapnika Exclusive Interview Part 2
  సమంతకు థ్యాంక్యూ చెప్పిన సాయిపల్లవి

  సమంతకు థ్యాంక్యూ చెప్పిన సాయిపల్లవి

  ఇదిలా ఉండగా, సమంత తనకు, లవ్ స్టోరి సినిమా యూనిట్‌కు సమంత విషెస్ అందజేయడంపై సాయిపల్లవి స్పందించారు. థ్యాంక్యూ సమంత అంటూ సమంతకు రిప్లై ఇచ్చింది. అయితే సమంత చేసిన ట్వీట్‌కు మాత్రం ఇంకా చైతన్య రిప్లై ఇవ్వలేదు. అయితే చైతూ రిప్లై గురించి ఆసక్తిగా అభిమానులు వేచి చూస్తన్నారు.

  English summary
  Samantha Ruth Prabhu Wishes Naga Chaitanya and Love Story unit. She tweet that, WINNER!! All the very best to the team Sai_Pallavi92 Hugging face.. #LoveStoryTrailer.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X