Samantha: మహేష్, త్రివిక్రమ్‌ను పట్టించుకోని సమంత.. సక్సెస్ కొట్టాలంటూ ఆ హీరోకు మాత్రమే విషెస్!
సంక్రాంతి పండుగ కానుకగా తెలుగు సినిమా పరిశ్రమలో ఎన్నడూ లేని విధంగా భారీ పోటీ నెలకొన్నది. ఈ ఏడాది సంక్రాంతికి గుంటూరు కారం, హనుమాన్, సైంధవ, నా సామి రంగ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సారి బరిలో సంక్రాంతి విజేతగా నిలిచేందుకు మహేష్ బాబు, వెంకటేష్, నాగార్జున అక్కినేనితోపాటు యువ హీరో తేజ సజ్జా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. అగ్ర హీరోలు, భారీ బడ్జెట్ చిత్రాలు పోటీలో నిలువడంతో స్క్రీన్ల కేటాయింపు వివాదంగా మారింది. దాంతో మీడియాలో ఈ సినిమాల గురించి భారీ చర్చ జరుగుతున్నది. ఈ క్రమంలో సమంత ఓ సినిమాకు గుడ్ లక్ చెప్పడం వైరల్‌గా మారింది. సమంత విషెస్ చెప్పిన హీరో ఎవరు? ఏ సినిమా అనే వివరాల్లోకి వెళితే..
ప్రస్తుతం సంక్రాంతి బరిలో తన మాజీ మామ నాగార్జున అక్కినేని హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. సొగ్గాడే చిన్నినాయన, బంగార్రాజు సినిమాలతో సంక్రాంతి హిట్స్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఈ క్రమంలో పోటీ భారీగానే కనిపిస్తున్నది.

ఇలా టాలీవుడ్‌లో ముగ్గురు అగ్ర హీరోలు మధ్యన యువ హీరో తేజా సజ్జా హనుమాన్ సినిమాతో వస్తున్నాడు. అయితే పెద్ద హీరోలు, పెద్ద సినిమాల మధ్య హనుమాన్ రావడంపై రకరకాల చర్చ జరిగింది. అయితే తాము మా సినిమా రిలీజ్ డేట్ ముందుగా ప్రకటించాం. కాబట్టి కొన్ని స్క్రీన్లు ఇవ్వాలని నిర్మాత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే రకరకాల వివాదాల మధ్య హనుమాన్ రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు మెగాస్టార్ చిరంజీవి రావడం తెలిసిందే. ఆ సందర్భంగా దిగిన ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో తేజ సజ్జా పోస్టు చేస్తూ.. మా హనుమాన్ కోసం నా హనుమాన్. నా జీవితంలో అత్యధికంగా ఇష్టపడే వ్యక్తి చిరంజీవి సార్ అంటూ పోస్టు పెట్టారు.

చిరంజీవి గురించి తేజా సజ్జా పెట్టిన పోస్టుపై సమంత రుత్ ప్రభు స్పందించింది. ఈ సినిమా టీమ్‌కు సమంత రుత్ ప్రభు శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. నీవు సాధించావు తేజా సజ్జా.. హనుమాన్ 12వ తేదీన రిలీజ్ అవుతున్నది అని సమంత తన ఇన్స్‌టాగ్రామ్ స్టేటస్ ద్వారా తెలియజేసింది. గతంలో వీరిద్దరూ కలిసి ఓ బేబీ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. ఆ బంధంతోనే సమంత ఈ పోస్టు పెట్టిందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇదిలా ఉండగా, గతంలో మహేష్ బాబుతో కలిసి సమంత దూకుడు చిత్రంలో నటించింది. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో కూడా రెండు మూడు సినిమాలు చేసింది. అలాగే అక్కినేని కోడలుగా నాగార్జునతో రిలేషన్ ఉంది. ప్రస్తుతం దూరమైనప్పటికీ.. ఈ ఇద్దరికి సంక్రాంతి విషెస్ చెప్పి.. సినిమా యూనిట్‌కు విజయం సాధించాలని శుభాకాంక్షలు చెప్పలేదేంటి? అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది.


Click it and Unblock the Notifications











