పబ్లిక్‌గా ఆ డైరెక్టర్‌తో అలా.. బాయ్‌ఫ్రెండ్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయిన సమంత
అక్కినేని నాగచైతన్యతో విడాకుల తర్వాత తన బతుకు తాను బతుకుతున్నారు అగ్ర నటి సమంత. అయితే శోభితను నాగచైతన్య రెండో పెళ్లి చేసుకోవడంతో సమంత కూడా రెండో పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిమానులు, సినీ ప్రముఖులు కోరుకుంటున్నారు. గత కొంతకాలంగా సమంత వైవాహిక జీవితం గురించి మీడియాలో వార్తలు ఎక్కువయ్యాయి. ఏ సందర్భాన్ని కూడా నెటిజన్లు వదిలిపెట్టడం లేదు. తాజాగా సమంత మరోసారి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ వివరాల్లోకి వెళితే..
నాగచైతన్యతో నాలుగేళ్లు వైవాహిక జీవితం
ఏమాయ చేశావే సినిమా సమయంలో ప్రేమలో పడ్డ నాగచైతన్య - సమంతలు పెద్దల అంగీకారంతో 2017లో ఒక్కటయ్యారు. కానీ నాలుగేళ్లు తిరిగేసరికి 2021లో ఈ జంట విడాకులు తీసుకుంది. చైతూతో విడాకుల తర్వాత మౌనం దాల్చిన సమంత.. స్నేహితులతో విహారయాత్రలు, తీర్థయాత్రలతో బాధను మరిచిపోయేందుకు ప్రయత్నించారు. తిరిగి సినిమాలలో బిజీ అవుతుండగా మయోసైటిస్ అనే అరుదైన వ్యాధి బారినపడ్డారు. ఎంతో శ్రమించి ఆ వ్యాధి నుంచి తిరిగి కోలుకున్నారు.

నిర్మాతగా మారిన సమంత
టాలీవుడ్‌కు దూరంగా బాలీవుడ్‌లో ఫ్యామిలీ మెన్ , సిటాడెల్ వెబ్ సిరీస్‌లతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇదివరకటి మాదిరిగా సినిమాలు చేయకున్నా సమంత క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఆమెతో సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు క్యూకడుతున్నారు. కానీ ఆమె మాత్రం సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఇటీవలే నిర్మాతగా మారిన సామ్.. ట్రాలాలా పేరిట నిర్మాణ సంస్థను స్థాపించి తొలి ప్రయత్నంగా శుభం అనే సినిమాను నిర్మించారు. హార్రర్, కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. ఇదే ఊపులో మరిన్ని సినిమాలు నిర్మించి, యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహించాలని నిర్ణయించింది.
రాజ్‌తో సమంత చెట్టాపట్టాల్
సమంత రెండో పెళ్లిపై గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం లేకపోలేదు సిటాడెట్ వెబ్ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో ఆమె సన్నిహితంగా మెలుగుతుండటం అనుమానాలకు తావిస్తోంది. అలాగే పలు ఈవెంట్స్‌కు కూడా వీరి కలిసి హాజరవుతున్నారట. రాజ్ నిడిమోరుకు ఇప్పటికే పెళ్లి కాగా.. ఆమె కారణంగా సమంతతో వివాహం ఆలస్యమైందనే గాసిప్స్ వినిపిస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి. రాజ్ నిడిమోరు తెలుగువారు కావడం గమనార్హం.
రాజ్ భుజంపై వాలిపోయిన సమంత
కొద్దిరోజుల క్రితం తిరుమల శ్రీవారిని, శ్రీకాళహస్తిలో కాళహస్తీశ్వరుడిని సమంత దర్శించుకున్నారు. ఆ సమయంలో రాజ్ నిడిమోరు పక్కనే ఉండటం చర్చనీయాంశమైంది. వివాహం విషయంలో చోటు చేసుకున్న ఇబ్బందులు తొలగి పోవాలనే ఉద్దేశంతోనే సమంత రాహుకేతువుల పూజలు చేయించుకున్నారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. తాజాగా శుభం సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో సమంత వెంటే రాజ్ నిడిమోరు కనిపిస్తున్నారు. థియేటర్‌లో కలిసి సినిమా చూడటంతో పాటు విమానంలో రాజ్ భుజాలపై సమంత వాలిపోయి కనిపించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. సమంత - రాజ్ జంటకు నెటిజన్లు సామ్రాజ్ అనే పేరును ఫిక్స్ చేశారు. మరి దీనిపై వీరిద్దరూ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











