సమంతకు ఇష్టమైన టాలీవుడ్ హీరో.. అతనిలో సామ్ కు నచ్చిందేంటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన పనిలేదు. దశాబ్దం పాటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఊపూపిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగచైతన్య సరసన 'ఏమాయా చేసావే' చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగుపెట్టి ఆ తర్వాత ఎంతటి సంచలనంగా మారింతో తెలిసిన విషయమే. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్ ను కూడా దాటేసి పూర్తిగా బాలీవుడ్ లోనే సమయం గడుపుతోంది. అక్కడే భారీ ప్రాజెక్ట్స్ ల్లో నటించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే సమంత తనను ఇండస్ట్రీకి పరిచయం చేసిన నాగచైతన్యనే పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. 2017లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఆ తర్వాత నాలుగేళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా కాపురం చేశారు. టాలీవుడ్ లోనే బెస్ట్ స్టార్ కపుల్ అని గుర్తింపు కూడా పొందారు. కానీ ఏమైందో ఏమో గానీ సడెన్ గా వారి డివోర్స్ ను 2021లో ప్రకటించి విడిపోయిన సంగతి కూడా అందరికీ తెలిసిందే. ఇక అప్పటి నుంచి సమంత ఒంటరిగానే ఉంటోంది.

Samantha Ruth Prabhu s Favourite Tollywood Hero is

నాగచైతన్యతో విడిపోయిన తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ ను దాదాపుగా విడిచిపెట్టి బాలీవుడ్ లోనే సినిమాలు చేసేందుకు మొగ్గు చూపిస్తోంది. ఇదిలా ఉంటే.. సమంతకు టాలీవుడ్ లో నాగచైతన్య కంటే ఇష్టమైన మరొక హీరో కూడా ఉన్నారు. ఆయన మరెవరో కాదంట సూపర్ స్టార్ మహేశ్ బాబు కావడమే విశేషం. అయితే సమంత తన కెరీయర్ ప్రారంభంలో సాక్షి ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని చెప్పింది.

ప్రస్తుతం మహేశ్ బాబు గ్లోబ్ ఫిల్మ్ చేస్తున్న సందర్భంగా మహేశ్ బాబు గురించి సమంత చెప్పిన ఆసక్తికరమైన విషయాలను బయటకి వస్తున్నాయి. అయితే ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ అంటే మీకు ఇష్టమా? లేకా మహేశ్ బాబు అంటే ఇష్టమా? అనే ప్రశ్న ఎదురైంది. దీంతో సమంత ఒక్క క్షణం కూడా ఆలోచించుకుండా మహేశ్ బాబు అని చెబుతుంది. మహేశ్ బాబు అంటే తనకు ఫేవరేట్ హీరో అని, అతని హ్యాండసమ్ లుక్ తను ఫిదా అని కూడా చెప్పడం విశేషం.

అయితే బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తనకు పెద్దగా నచ్చని చెప్పుకొచ్చింది. ఆయన లుక్స్ పెద్దగా తనను ఆకట్టుకోలేవని చెప్పింది. ఈ విషయంలో అభిమానులు హర్ట్ కావొద్దని, అది కేవలం తన అభిప్రాయమేనని, ఆయనకున్న క్రేజ్ వెరే లెవల్ అని, కానీ మహేశ్ బాబు, హృతిక్ అన్నప్పుడు మాత్రం తన ఓటు మహేశ్ బాబుకే అని చెప్పుకొచ్చింది. ఇక మహేశ్ బాబుతో కలిసి సమంత రూత్ ప్రభు 'దూకుడు' చిత్రంలో నటించి బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఆ మూవీ తర్వాత సమంత కెరీయర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్ లో సినిమాలు చేస్తోంది. చివరిగా బాలీవుడ్ దర్శకులు రాజ్ అండ్ డీకే ద్వయం దర్శకత్వంలో వచ్చిన 'సిటాడెల్’ సిరీస్ తో అలరించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X