Samantha: సమంత ఇష్టపడే ఐదుగురు హీరోయిన్లు ఎవరో తెలుసా?.. ఆ స్టార్స్ ఎవరంటే?
దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్ సినీ రంగంలో కూడా తన మార్కు చూపించుకొంటే అగ్రశ్రేణి హీరోయిన్‌గా సమంత రుత్ ప్రభు రాణిస్తున్నారు. ఇటీవల తన జీవితంలో చోటు చేసుకొన్న వ్యక్తిగత సమస్యలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులను పరిష్కరించుకొని మళ్లీ తన సత్తాను చాటేందుకు ప్రయత్నిస్తున్నారు. కొద్ది నెలలుగా సినిమాలను ఆచితూచీ చేస్తున్న ఈ అందాల భామ తనకు నచ్చిన హీరోయిన్ల సినిమాలను చూస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నది. సోషల్ మీడియాలో ఇటీవల ఆమె వెల్లడించిన టాప్ 5 హీరోయిన్ల జాబితా వివరాల్లోకి వెళితే..
సమంత సినిమాల షూటింగులు, ఈవెంట్లు, ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా అకౌంట్స్‌లో బిజీగా ఉంటారు. తన జీవితానికి సంబంధించిన మంచి, చెడు, సంతోషం, బాధలను తన అభిమానులతో పంచుకొంటారు. ప్రతీ విషయం గురించి తన అభిప్రాయాలను ఇన్స్‌టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడిస్తుంటారు.

అయితే తాజాగా సోషల్ మీడియాలో తన అభిమానులు, నెటిజన్లతో ఇంటారాక్ట్ అయ్యారు. ఆస్క్ మీ అంటూ నెటిజన్లు, ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన రీతిలో జవాబిచ్చారు. అన్ని విషయాల గురించి ఆమె నిర్మోహమాటంగా తన భావాలను పంచుకొన్నారు. Ask Me సెషన్‌లో ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఓపిగా, నిదానంగా తన సమాధానాలను చెప్పారు. ఈ సందర్బంగా ఆమె అన్ని వర్గాల అభిమానులను ఆకట్టుకొనే ప్రయత్నం చేసినట్టు కనిపించింది.
అయితే మీకు నచ్చిన 5 గురు హీరోయిన్లు ఎవరు? అంటే ఎలాంటి సంకోచం లేకుండా తనకు నచ్చిన ఐదుగురు ప్రతిభావంతులైన తారల పేర్లను వెల్లడించారు. ఇటీివల వచ్చిన సినిమాల్లో వారి నటన నాకు బాగా నచ్చింది. వారి పెర్ఫార్మెన్స్‌కు నేను ఫిదా అయ్యాను. వారి నటన చాలా బాగుంది అంటూ ఆ ఐదు సినిమాల గురించి సమంత తన సమాధానంతో వెల్లడించారు.
నెటిజన్ ప్రశ్నకు సమంత సమధానం ఇస్తూ.. ఉల్లోజుక్కు సినిమాలో పార్వతి పెర్ఫార్మెన్స్ నచ్చింది. ఆమె నటన చాలా బాగుంది. అలాగే సూక్ష్మదర్శిని చిత్రంలో నజ్రియా యాక్టింగ్ అదిరిపోయింది. అలాగే అమరన్ చిత్రంలో సమంత భావోద్వేగమైన నటన, కీలక సన్నివేశాల్లో అద్బుతంగా నటించారు. అలాగే యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రం జిగ్రాలో ఆలియా ఫెర్ఫార్మెన్స్ బాగుంది. అలాగే CTRL చిత్రంలో అనన్య పాండే నటన కూడా మెప్పించేలా ఉంది అని సమంత చెప్పారు.
సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన యశోద చిత్రం భారీ విజయం సాధించగా.. ఆ తర్వాత రిలీజైన శాకుంతలం సినిమా డిజాస్టర్ అయింది. విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి అంతగా విజయం సాధించలేదు. ప్రస్తుతం రాజ్ డీకే పర్యవేక్షణలో షూటింగ్ జరుపుకొంటున్న రక్త్ బ్రహ్మండ్: ది బ్లడీ కింగ్ డమ్ అనే వెబ్ సిరీస్‌లో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











