Samantha: రాజ్ నిడిమోరుని అలా పిలిచిన సమంత... షాక్‌లో సుమ కనకాల

బాలీవుడ్ దర్శకుడు రాజ్ నిడిమోరుతో పెళ్లి తర్వాత జీవితంలో సెకండ్ చాప్టర్ ప్రారంభించారు అగ్ర కథానాయిక సమంత రూత్ ప్రభు. అనివార్య కారణాలతో సినిమాలకు కాస్త దూరంగానే ఉంటున్న ఈ ముద్దుగుమ్మ.. తిరిగి యాక్టీవ్ అవుతున్నారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మా ఇంటి బంగారంతో పాటు బాలీవుడ్ సూపర్‌స్టార్ సల్మాన్ ఖాన్‌తో ఓ సినిమాలో నటించబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్‌లోనూ బలంగా జెండా పాతాలని సామ్ భావిస్తున్నారు.

నందిని రెడ్డి దర్శకత్వంలో మా ఇంటి బంగారం మూవీ తెరకెక్కుతుండగా.. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, హిమాంక్ దువ్వూరు, రాజ్ నిడిమోరులు నిర్మిస్తున్నారు. సమంత భర్త రాజ్ నిడిమోరు ఈ సినిమాకు నిర్మాతగా పాటు కథను కూడా అందించారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ధర్మేంద్ర కాకర్ల ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించారు. సమ్మర్ కానుకగా మే 15న మా ఇంటి బంగారం మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. తాజాగా ఉగాదిని పురస్కరించుకుని.. సమంత- నందిని రెడ్డిలు స్టార్ యాంకర్ సుమ కనకాలతో కలిసి సందడి చేశారు. ఉగాది పచ్చడి చేయడం ఎలా అంటూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

Samantha Ruth Prabhu s Ugadi Pachadi Surprise and Fun Call with Raj Nidimoru Goes Viral

ఉగాది పచ్చడి కోసం ఇంత పెద్ద క్యారేజీలు తీసుకొచ్చారేంటీ అంటూ సమంత అడగ్గా.. అవి రెండు ఖాళీ క్యారేజీలు, మా ఫ్రెండ్ మాలిని అన్ని తయారు చేసింది అక్కడికి వెళ్లి నింపుకుని వస్తానని పంచ్ వేసింది సుమ. సినిమా షూటింగ్ ఆల్‌మోస్ట్ అయిపోయింది.. మొన్న రిలీజ్ చేసింది టీజర్‌కి ఎక్కువ, ట్రైలర్‌కి తక్కువ అంటూ మా ఇంటి బంగారం గురించి చెప్పింది సామ్. అది ట్రైలర్ కాదని నాకు ముందే తెలుసు.. ట్రైలర్ అయితే ఈవెంట్ పెడతారు, నన్ను పిలుస్తారు కదా అంటూ సుమ పంచ్ విసిరింది.

ఈ సినిమాలో ఫైట్స్ కూడా ఉన్నాయని శారీలోనే చేశామని సమంత చెప్పారు. సల్వార్‌లో చేద్దామని అనుకున్నాం, కానీ కొంచెం కష్టపడి శారీలోనే ఫైట్స్ చేయడం బాగా వర్కవుట్ అయ్యిందని సమంత తెలిపింది. ఫైట్స్ చేసేటప్పుడు చాలా గాయాలు కూడా అయ్యాయని నందిని రెడ్డి పేర్కొన్నారు. వంట తప్పించి నాకు అన్నీ వచ్చు అని సమంత చెప్పగా.. మరి గ్యాస్ లేదా అని సుమ అడిగింది. ఉగాది పచ్చడికి గ్యాస్ కావాలా? అని సమంత షాక్ అయ్యింది. ఉగాది పచ్చడికి గ్యాస్ ఏం అక్కర్లేదని సుమ చెప్పింది.

ఉగాది పచ్చడి పూర్తి చేసిన తర్వాత తన ఇంట్లో దేవుడి ముందు పెట్టింది సమంత. ఇంటి డెకరేషన్ మొత్తం నేనే చేశాను, ఉగాది పచ్చడి కూడా నేనే చేశానని చెప్పడంతో సుమ, నందిని రెడ్డి షాక్ అయ్యారు. ఈ సినిమాలో ఆడవాళ్లకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. గౌతమి గారు అత్త క్యారెక్టర్ చేస్తున్నారు. శ్రీలక్ష్మీ గారు బామ్మ క్యారెక్టర్, శ్రీముఖి తోడికోడలిగా నటిస్తున్నారు. సమంత పెద్ద కోడలు, శ్రీముఖి చిన్న కోడలిగా నటించారని నందినీ రెడ్డి చెప్పారు. ఫిమేల్ ఫ్రెండ్‌షిప్, ఫిమేల్ హ్యూమర్ మనం చూడలేదు కదా.. అందుకే ఫ్రెష్ థీమ్‌తో వస్తున్నామని సమంత అన్నారు.

ఈ కార్యక్రమం చివరిలో సమంత తన భర్త రాజ్ నిడిమోరుకు వీడియో కాల్ చేశారు. ఆ వెంటనే హాయ్ బాబు.. ఉగాది పచ్చడి చేశాను అని సమంత చెప్పగా.. నువ్వు చేశావా అంటూ సెటైర్ వేశాడు రాజ్. ఆ మాటలతో సుమ, నందిని రెడ్డి షాక్ అవుతారు. ఆ వెంటనే వారి ముగ్గురికి ఉగాది శుభాకాంక్షలు చెప్పారు రాజ్. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X