నా ప్రేమకథ ఇలాగే ఎంతో కాలం కొనసాగాలని కోరుకుంటున్నా.. సమంత ఆసక్తికర కామెంట్స్
సమంత అక్కినేని.. దక్షిణాదిలో టాప్ హీరోయిన్‌లలో ఒకరుగా ఓ వెలుగు వెలుగుతోంది. తాజాగా సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. నటిగా సమంత ఫిబ్రవరి 26తో పన్నెండేళ్ల కెరీర్ కంప్లీట్ చేసుంది. ఈ పుష్కర కాలంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించింది. దాంతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలతో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఈ మధ్యన విడాకులు కూడా తీసుకున్న ఆమె ఈ సందర్భంగా ఒక స్పెషల్ నాట్ పందుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఏ మాయ చేశావే
సమంత మొదటి తెలుగు సినిమా..నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఏ మాయ చేశావే'. ఈ సినిమాలో జెస్సీ..గా సమంత తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుని కూర్చుంది. నాగచైతన్య హీరోగా గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఇందిరా ప్రొడక్షన్స్ బ్యానర్ పై సూపర్ స్టార్ మహేష్ బాబు సోదరి మంజుల ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ వచ్చి 12 ఏళ్లవుతోంది అంటే నమ్మడం కష్టమే. ఆసక్తికరమైన ప్రేమ కథగా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి అటు నాగచైతన్యకి మాత్రమే కాకుండా హీరోయిన్ గా సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది.

'రాజీ' అనే ఒక బోల్డ్ పాత్రలో
అలా మొదటి సినిమాతోనే హిట్ అందుకున్న సమంత ఆ తరువాత అయితే మళ్ళీ వెనుదిరిగి చూడలేదు. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుంటూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. వరుసగా స్టార్ హీరోల సరసన నటిస్తూ అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుని స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. స్టార్ డమ్ ఉండగానే చైతన్యని ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగు ఇంటి కోడలు అయింది.

లేడీ ఓరియెంటెడ్ కథలకు
ఆ తరువాత ప్రయోగాత్మక చిత్రాలకు శ్రీకారం చుట్టిన సమంత లేడీ ఓరియెంటెడ్ కథలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చింది. ఇందులో భాగంగా ఆమె నటించిన వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ -2లో 'రాజీ' అనే ఒక బోల్డ్ పాత్రలో నటించి నేషనల్ వైడ్ గా విమర్శకుల ప్రశంసలతో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే అనూహ్య పరిస్థితులతో వారు విడాకులు కూడా తీసుకున్నారు.
12 ఏళ్లు పూర్తయ్యాయి
ఇక నటిగా 12 ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సమంత షేర్ చేసిన పోస్ట్ ఆసక్తికరంగా మారింది. చిత్ర పరిశ్రమలో నటిగా నా ప్రయాణం మొదలై నేటితో 12 ఏళ్లు పూర్తయ్యాయి. లైట్స్ కెమెరా యాక్షన్ .. వీటన్నింటి చుట్టూ నాకున్న మధుర జ్ఞాపకాలు.. అద్భుతమైన అనుభూతులకు 12 ఏళ్లు పూర్తయ్యాయి. ఇన్నేళ్ల గొప్ప ప్రయాణం ప్రపంచవ్యాప్తంగా నిస్వార్థమైన అభిమానుల్ని పొందినందుకు ఆనందంగా వుంది'' అని ఆమె పేర్కొంది..

ప్రేమకథ ఇలాగే
''కెమెరాతో నా ప్రేమకథ ఇలాగే ఎంతో కాలం కొనసాగాలని కోరుకుంటున్నా అని సమంత పోస్ట్ చేశారు. ఇక ప్రస్తుతం సూపర్ నేచురల్ పవర్స్ నేపథ్యంలో రూపొందుతున్న యశోద చిత్రంలో నటిస్తోంది. ఆమె శాకుంతలం అనే సినిమా షూటింగ్ పూర్తి చేయగా అది రిలీజ్ కు సిద్ధంగా ఉంది.


Click it and Unblock the Notifications











