twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అందుకే 'ఊ అంటావా మావ' పాట చేశా.. సమంత బోల్డ్ కామెంట్స్!

    |

    సమంత అక్కినేని గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అక్కినేని నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఆమె చేసిన పుష్ప సాంగ్ సూపర్ హిట్ అయింది. ఆ పాట ద్వారా ఆమెకు మరింత క్రేజ్ లభించింది. తాజాగా ఆ పాట చేయడం వెనుక ఉన్న కారణాలను సమంత బయట పెట్టింది. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    పర్సనల్ విషయాల్లో

    పర్సనల్ విషయాల్లో


    అక్కినేని నాగచైతన్య, సమంత ప్రేమించే వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కూడా అక్టోబర్ నెలలో విడాకులు తీసుకుంటున్నామని అధికారులు ప్రకటించారు. వీరు ఈ మధ్య ఏం సమస్య తెలియదు కానీ వీరి విడాకుల గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పటికీ కూడా వీరి గురించి ఎలాంటి వార్త వచ్చినా అది వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉంటుంది. అయితే సమంత తాజాగా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న నేపథ్యంలో ఆయన సమంత పర్సనల్ విషయాల్లో సంబంధించి కొన్ని ప్రశ్నలు అడిగారు.

    సాంగ్ చేయడానికి

    సాంగ్ చేయడానికి

    వాటిలో కొన్నింటికి సమాధానం చెప్పిన సమంత కొన్నింటికి మాత్రం తెలివిగా సమాధానాలు చెప్పి తప్పించుకుంది. ఆ సంగతి పక్కన పెడితే సమంత పుష్ప సినిమా విడుదలకు 20 రోజులు ఉందనగా ఒక ఐటమ్ సాంగ్ చేయడం కరెక్టే అనుకుంటున్నావా అని కరణ్ ప్రశ్నిస్తే అందుకు సమంత ఆసక్తికరంగా స్పందించింది. ఆ ప్రశ్నకు కరణ్ జోహార్ మూడు ఆప్షన్స్ ఇవ్వగా ఆప్షన్స్ తో మూడో ఆప్షన్ ఎంచుకుంటూ అందరికీ షాక్ ఇచ్చింది. అలాగే ఈ సాంగ్ చేయడానికి గల కారణాలను కూడా సమంత వెల్లడించింది.

    సెటైరికల్‌గా

    సెటైరికల్‌గా


    ఆ సాంగ్‌ హాట్ లుక్స్‌‌తో బోల్డ్ గా ఎందుకు చేశావు ? ఇది తిరుగు బాటు చర్యా లేకా వ్యూహాత్మక ఎత్తుగడా, లేదా "ఫ*, నేను చేస్తాను" అయితే ఏంటి అని భావించి చేశారా అంటే ఆమె అదే ఆప్షన్ ఎంచుకుంది. అనంతరం సామ్ ఐటమ్ సాంగ్ ఎందుకు చేశాను అనేది వివరణ ఇస్తూ.. "ఈ పాట మగవారికి వ్యతిరేకంగా ఉంటుందని, తేడాగా చూసే మగవారి చూపులకు ఇది వర్తిస్తుందని పేర్కొంది. మగవారిపై సెటైరికల్‌గా ఉన్నందునే ఈ సాంగ్ చేశాను అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

    సెటైర్ వేయగలరంటూ

    సెటైర్ వేయగలరంటూ

    దీనిపై చాలా విమర్శలు, ట్రోలింగ్స్ వచ్చాయి అని ఆమె పేర్కొంది. అయినా నాలాంటి పెద్ద స్టార్ కాకపోతే మగవారి చూపులపై ఇంకెవరు సెటైర్ వేయగలరంటూ ఆమె కామెంట్ చేసింది. అదే సమయంలో అందరు నటీనటుల మాదిరిగానే తన బాడీని వాడుకున్నానని చెబుతూ సమంత తన మాటలను సమర్దించుకునే ప్రయత్నం చేసింది.

    ఎంట్రీ ఇవ్వడానికి

    ఎంట్రీ ఇవ్వడానికి

    ప్రస్తుతం సమంత చేసిన ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఇప్పటికే పుష్ప సినిమాలోని ఊ అంటావ పాటతో బాలీవుడ్ ప్రేక్షకులకి మరింత దగ్గరైంది. ఆమె ఇప్పుడు బాలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్టు చెబుతున్నారు. అయితే అది ఎప్పటికి నిజమవుతుందో చూడాలి మరి.

    English summary
    Samantha ruthprabhu reveals reason behind doing item song in pushpa movie at koffee with karan show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X