మరో షాకింగ్ పోస్ట్ పెట్టిన సమంత.. మహిళలు ఏం చేసినా అంతే, మగవాళ్లు చేస్తే ఏమీ ఉండదు.. అంటూ!

అక్కినేని నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారం ఇంకా సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. తమ మధ్య విభేదాలు రావడంతో తమ యొక్క భార్యాభర్తల బంధానికి ముగింపు పలుకుతున్నామని, కలిసి జీవించడం లేదని, మేము విడిపోతున్నాం అని ఇద్దరూ ప్రకటించినా సరే వారి జీవితాల గురించి రోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లుగానే సమంత తన సోషల్ మీడియా వేదికగా చేస్తున్న పోస్టులు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ చర్చనీయాంశం అవుతుంది. ఆ వరాల్లోకి వెళితే

నేరుగా స్పందించకున్నా

నేరుగా స్పందించకున్నా

నిజానికి విడాకులు ప్రకటన తర్వాత మొట్టమొదటిసారిగా సమంత పెట్టిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూసి దాదాపు అందరూ బాధ పడ్డారు. సమంత చాలా బాధపడుతుంది అనే విషయాన్ని ఆ పోస్టు ద్వారా వెల్లడించింది. డైరెక్ట్ గా ఆమె చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు మరో కొటేషన్ కూడా ఆమె షేర్ చేయడంతో ఆ కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

మరి మగవాళ్లు చేస్తే

మరి మగవాళ్లు చేస్తే

''మహిళలు ఏం చేసినా నైతికత గురించి ప్రశ్నిస్తారు. మరి మగవాళ్లు చేస్తే ఈ ప్రశ్న ఎప్పుడూ ఉండదు. అలాంటప్పుడు ఓ సమాజంగా మనకే ఏ నైతికత లేదు.. అంటూ సమంత పోస్ట్ చేసింది. అయితే కొద్ది రోజులుగా సమంత కారణంగానే ఈ విడాకులు వచ్చాయని ఆమె వ్యవహార శైలి బాగోలేదని పెద్ద ఎత్తున ఆమెను టార్గెట్ చేసి ప్రచారం చేస్తున్నారు.

 కుంగిపోయిన సమంత

కుంగిపోయిన సమంత

ఇప్పటి వరకు ఈ ట్రోలింగ్ మీద సమంత నేరుగా స్పందించలేదు కానీ ఆమె స్నేహితులు, సన్నిహితులు తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు సమంత కూడా ఈ విషయాలను ప్రశ్నిస్తున్నట్లుగా ఈ కొటేషన్ షేర్ చేసింది. ఇక జరుగుతున్న ప్రచారం మేరకు విడాకుల ప్రకటన తర్వాత సమంత బాగా కుంగి పోయినట్లు తెలుస్తోంది.

యాడ్ ఫిలిం షూట్ లో ఏడ్చి

యాడ్ ఫిలిం షూట్ లో ఏడ్చి

రెండు మూడు రోజుల క్రితం హైదరాబాద్ లో ఒక యాడ్ ఫిలిం షూటింగ్ లో పాల్గొన్న సమంత షూటింగ్ గ్యాప్ లో గత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఏడ్చినట్టు చెబుతున్నారు. సరిగ్గా పెళ్లి రోజున యాడ్ ఫిలిం షూటింగ్ జరగడంతో చైతన్య తో ఉన్న జ్ఞాపకాలను నెమరు వేసుకుని ఆమె ఏడ్చినట్టు ప్రచారం జరిగింది.

పాతిక లక్షలు గెలిచి

పాతిక లక్షలు గెలిచి

ఇక తాజాగా మా ఎన్టీఆర్ హోస్ట్ గా నిర్వహిస్తున్న మీలో ఎవరు కోటీశ్వరులు అనే షో లో కూడా పాల్గొన్నారు. షోలో పాల్గొన్న ఆమె పాతిక లక్షల రూపాయలు కూడా గెలుచుకున్నారు. ఆ పాతిక లక్షల రూపాయలు తన ప్రత్యూష ఫౌండేషన్ సంస్థకు విరాళం ఇచ్చిందని తెలుస్తోంది.

ఏకకాలంలో ప్రకటనలు

ఏకకాలంలో ప్రకటనలు

ఇక మరో ప్రచారం మేరకు సమంత చేతిలో ఇప్పుడు మూడు పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయని అంటున్నారు. తమిళ తెలుగు భాషలు కు సంబంధించిన ఈ మూడు ప్రాజెక్టులకు సమంత నటిస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించాలని కూడా సమంత కోరినట్లు తెలుస్తోంది. విడాకుల తర్వాత కూడా సమంత ఎక్కడా తగ్గడం లేదు అని సంకేతాలు సినీ ఇండస్ట్రీకి పంపే విధంగా ఆమె ఒకే కాలంలో ఈ ప్రకటనలో వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X