ప్రాణహాని ఉంది.. డబ్బు లాక్ చేశారు... ప్రైవసీ అతిక్రమించారు.. సమంత షాకింగ్ పోస్ట్
అక్కినేని నాగచైతన్య, సమంత విడాకుల వ్యవహారం ఇంకా సోషల్ మీడియాలో నానుతూనే ఉంది. తమ మధ్య విభేదాలు రావడంతో తమ యొక్క భార్యాభర్తల బంధానికి ముగింపు పలుకుతున్నామని, కలిసి జీవించడం లేదని, మేము విడిపోతున్నాం అని ఇద్దరూ ప్రకటించి నెలలు కావస్తున్నా వారి గురించి రోజూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. దానికి తగ్గట్లుగానే సమంత తన సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను ప్రస్తావిస్తూ చేస్తున్న పోస్టులు కూడా చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ మరోసారి చర్చనీయాంశం అవుతుంది. ఆ వివరాల్లోకి వెళితే

నేరుగా స్పందించకున్నా
నిజానికి విడాకులు ప్రకటన తర్వాత సమంత చాలా బాధపడుతున్నా అనే విషయాన్ని తన పోస్టుల ద్వారా వెల్లడిస్తోంది. డైరెక్ట్ గా ఆమె చెప్పాలనుకున్న విషయం చెప్పకుండా ఇన్స్టాగ్రామ్ లో ఉన్న కొటేషన్స్ షేర్ చేస్తూ తన బాధను వ్యక్తం చేస్తోంది. అయితే ఇప్పుడు మరో కొటేషన్ కూడా ఆమె షేర్ చేయడంతో ఆ కొటేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.

కొటేషన్ ని షేర్ చేసి
తాజాగా తన ఇన్ స్టా ఖాతాలో విల్ స్మిత్ కోట్ ను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది సమంత. ప్రముఖ హాలీవుడ్ హాస్యనటుడు విల్ స్మిత్ రాసిన విల్ పుస్తకం నుంచి ఓ కోట్ షేర్ చేయగా విల్ స్మిత్ జీవితంలో జరిగిన ఓ సంఘటనను తనతో కంపేర్ చేసుకుంటూ ఈ కొటేషన్ ని షేర్ చేసింది సమంత.

ఇటుక పేరుస్తున్నావా ?
అందులో.. ''గత ముప్పై సంవత్సరాలుగా.. మనందరిలాగే.. ఒకటి. వైఫల్యం, నష్టం, అవమానం, విడాకులు, మరణంతో వ్యవహరించాము, నాకు ప్రాణహాని ఉంది. నా డబ్బు లాక్ చేయబడింది. నా వ్యక్తిగత విషయాలను అతిక్రమించారు' అంటూ పేర్కొంది. నా కుటుంబం విచ్ఛిన్నమైంది. ప్రతిరోజూ కాంక్రీట్ కలిపి.. ఇటుకను పేర్చాలి. మీరు ఏ దారిలో వెళ్తున్నారో తెలియదు..కానీ అక్కడ ఎల్లప్పుడూ ఒక ఇటుక మీ ముందు ఉంటుంది.. అది కూడా పేర్చేందుకే ఉంది.. కానీ నువ్వు ఆ ఇటుక పేరుస్తున్నావా ? " అని ఉంది.

సినిమాల విషయానికి వస్తే
ఈ పోస్ట్ ఇప్పుడు తెగ వైరల్ అవుతుంది. అయితే ఆమె తన జీవితాన్ని కంపేర్ చేస్తూ ఈ పోస్ట్ చేసిందా? లేక ఇంకేదైనా? కారణాలు ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది. ఇక ఇటీవల పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ చేసిన సమంత ఆ పాట ద్వారా విపరీతమైన క్రేజ్ దక్కించుకుంది. ఇక సినిమాల విషయానికి వస్తే సమంత నటించిన తమిళ చిత్రం కాతువాకుల రెండు కాదల్ త్వరలో విడుదల కానుంది.

భారీ స్థాయిలో విడుదల
ఈ సినిమాను ఏప్రిల్ 28వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారిక ప్రకటన వెలువడింది. ఈమె నటించిన శకుంతలం సినిమాలో ఈమె ఫస్ట్ లుక్‌ను ఇటీవలే విడుదల చేశారు. త్వరలో ఈ సినిమాతో పాటు యశోద అనే మరో మూవీ కూడా విడుదల కానుంది. తెలుగులో ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేసే యోచనలో ఉన్నారు.


Click it and Unblock the Notifications











