మన్మధుడు 2: నాగార్జున మామ దగ్గర కూడా భారీగా రెమ్యూనరేషన్ చార్జ్ చేసిన సమంత!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా వరుస విజయాలతో ఇండస్ట్రీలో తన హవా కొనసాగిస్తోంది. 2019లో ఆమె నటించిన సూపర్ డీలక్స్, మజిలీ చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్టయ్యాయి. ప్రస్తుతం సమంత నటించిన 'ఓబేబీ' మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో పాటు తన మామయ్య నాగార్జున హీరోగా నటిస్తున్న 'మన్మధుడు 2' చిత్రంలో గెస్ట్ రోల్ చేస్తోంది.
'మన్మధుడు 2' చిత్రంలో సమంత పోషించేది గెస్ట్ రోల్ అయినప్పటికీ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందట. ఇప్పటికే ఆమె పాత్రకు సంబంధించిన పోర్షన్ చిత్రీకరణ పోర్చుగల్ షెడ్యూల్‌లో పూర్తయింది. ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సమంత రెమ్యూనరేషన్ హాట్ టాపిక్
‘మన్మధుడు 2' చిత్రంలో సమంత కనిపించేది కేవలం 5 నిమిషాలు మాత్రమేనట. అయితే తాను నటించేది చాలా తక్కువ సమయమే అయినా రెమ్యూనరేషన్ విషయంలో మాత్రం ఏ మాత్రం తగ్గలేదని టాక్. ఈ సినిమా కోసం భారీ మొత్తంలో చార్జ్ చేసినట్లు తెలుస్తోంది.

రూ. 35 లక్షలు తీసుకుందట?
హీరోయిన్‌గా నటించే సినిమాలకు సమంత రూ. 1.5 కోట్ల నుంచి రూ. 2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. అయితే ‘మన్మధుడు 2'లో చిన్న పాత్ర కావడంతో రూ. 35 లక్షల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. మామయ్య నిర్మించే సినిమా అయినప్పటికీ సమంత ఏ మాత్రం తగ్గలేదని చర్చించుకుంటున్నారు.

నా రోల్ ఈ స్టోరీలో చాలా ముఖ్యమైంది
‘మన్మధుడు 2'లో వెరీ ఇంట్రెస్టింగ్ అతిథి పాత్రలో కనిపించబోతున్నాను. నా పాత్ర గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేను. కానీ నా రోల్ ఈ స్టోరీలో చాలా ముఖ్యమైందిగా ఉంటుందనే హామీ ఇవ్వగలను... అని గతంలో ఓ ఇంటర్వ్యూలో సమంత తెలిపారు.

మన్మధుడు 2
మన్మధుడు 2 చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, వియాకామ్ 18, ఆనంది ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన పోర్చుగల్ షెడ్యూల్ పూర్తయింది. ఇందులో నాగార్జున సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. లక్ష్మీ, వెన్నెల కిషోర్, దేవదర్శిని, రావు రమేష్, నాజర్, అక్షర గౌడ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications











