సోషల్ మీడియా లో వైరల్ గా మారిన సమంత వాట్సాప్ చాటింగ్.. అప్పటి నుంచే అండగా!

టాలీవుడ్ లో మోస్ట్ క్యూట్ కపుల్ గా పేరుగాంచిన సమంత - నాగచైతన్య విడిపోవడం తెలుగు ప్రేక్షకులకు జీర్ణించుకోలేని విషయం. ముఖ్యంగా ఈ క్యూట్ కపుల్ కి సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉండేది. అందుకే ఇప్పటికీ వీరు విడిపోయి రెండు నెలలు గడుస్తున్నా ప్రతిరోజు సోషల్ మీడియాలో వాళ్ళ గురించి చర్చ నడుస్తోంది. అయితే తాజాగా సమంత షేర్ చేసిన వాట్సాప్ చాట్ ఆసక్తికరంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

అనునిత్యం టచ్ లో

అనునిత్యం టచ్ లో

సమంత ఎందుకో కానీ వైవాహిక జీవితానికి స్వస్తి పలికిన సమయం నుంచి సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది. తన బాధను తన సంతోషాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తూ... అభిమానులకు అనునిత్యం టచ్ లో ఉంటుంది. అలాగే సమంత చైతు తో విడిపోయినప్పటి నుంచి తన బాధను మై మామ్ సెడ్ అంటే అమ్మ చెప్పింది అంటూ పోస్టులు షేర్ చేస్తుంది.

 తన తల్లి ఎన్నో సార్లు

తన తల్లి ఎన్నో సార్లు

తనను తాను బూస్టప్ ఇచ్చుకునే క్రమంలో సమంత ఎన్నో ఇన్స్పిరేషనల్ కొటేషన్స్ షేర్ చేస్తూ తనలో ఆత్మస్థైర్యాన్ని నింపుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురవుతాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు నడవాలి అంటూ..తనకు తన తల్లి ఎన్నో సార్లు చెప్పిందని సమంతా చెబుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఎలాంటి విషయాలు షేర్ చేసుకునే ఆమె మరో కొటేషన్ షేర్ చేసింది.

వాట్సాప్ స్క్రీన్-షాట్

వాట్సాప్ స్క్రీన్-షాట్

ఇప్పుడు, సమంత తన తల్లితో తన వాట్సాప్ సంభాషణ యొక్క స్క్రీన్-షాట్ ను పంచుకుంది. ఈ స్క్రీన్-షాట్ లో సమంత తల్లి సమంత కు ఒక ఫోటో మెసేజ్ ను పంపించారు. "నీలో కొత్తదనం నీకు తెలియదు.. ఆ ముక్కలను తిరిగి పేర్చు.." అంటూ ఉన్న మెసేజ్ ను ఆమె పంపించారు. ఈ కొటేషన్ ఉన్న మెసేజ్ షేర్ చేస్తూ.. "బ్లెస్‌ యూ మై బేబీ" అంటూ మెసేజ్ చేసారు.

తల్లి సపోర్ట్

తల్లి సపోర్ట్

ఇక ఈ స్క్రీన్ షాట్ ను సమంత సోషల్ మీడియా లో పంచుకున్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత సమంత మానసికంగా బలహీన పడకుండా ఆమె తల్లి సపోర్ట్ చేస్తున్నారు. విడిపోయిన తర్వాత మొత్తం సోషల్ మీడియా ద్వేషాన్ని ఎదుర్కొంటున్న సమంతకు ఈ సపోర్ట్ బాగా ఉపయోగపడి ఉండవచ్చు.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక సమంత సినిమాల విషయానికి వస్తే తెలుగులో గుణశేఖర్ దర్శకత్వంలో ఆమె నటించిన శాకుంతలం త్వరలో విడుదల కానుంది. అలాగే అల్లు అర్జున్ సరసన పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది సమంత. ఇక ఇప్పటికే ఫ్యామిలీ మెన్ సిరీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది సమంత. బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్ట్ లను ఒకే చేసిందని టాక్. అది కాక ఒక హాలీవుడ్ మూవీ కి ఒకే చెప్పినట్లు అధికారికంగా ప్రకటించింది.

Recommended Video

₹200 Cr వదులుకున్న Samantha, వింత ప్రచారాలు.. షూటింగుకు వెళ్లడం కష్టం | ChaySam | Filmibeat Telugu
వరుస సినిమాలు

వరుస సినిమాలు

అలాగే సమంత తన తదుపరి సినిమాను డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ సినిమా చేయనున్నారు. ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఏక కాలంలో తెరకెక్కనుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X