సమంత స్ట్రాంగ్ రిప్లై: ఒక్క ట్వీటుతో వారి నోరు మూయించింది!
Recommended Video

సినిమా స్టార్స్, స్పోర్ట్స్ స్టార్స్ వివిధ సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్ గురించి ప్రచారం చేయడం సర్వసాధారణంగా జరిగే తంతు. అయితే కొన్ని సందర్భాల్లో సోషల్ మీడియాలో వారు చేస్తున్న ప్రచారంపై విమర్శలు కూడా వస్తుంటాయి. డబ్బు సంపాదన కోసం సెలబ్రిటీలు అనారోగ్యానికి కారణం అయ్యే జంక్ ఫుడ్ ప్రమోట్ చేస్తున్నారని కొందరి వాదన.
విరాట్ కోహ్లి లాంటి టాప్ క్రికెటర్లకు కూడా ఇలాంటి విమర్శలు తప్పలేదు. తాజాగా హీరోయిన్ సమంత సైతం ఇలాంటి విమర్శలు ఎదుర్కొంటోంది. ఆమె ప్రముఖ స్నాక్ బ్రాండ్ 'కుర్‌కురే' ప్రమోట్ చేయడమే ఇందుకు కారణం.

సమంత ట్వీట్‌పై
సదరు స్నాక్ బ్రాండ్ ప్రమోట్ చేస్తూ సమంత ట్వీట్ చేయగానే కొందరు నెటిజన్లు విరుచుకుపడ్డారు. సమంత లాంటి యాక్టర్లు, మోడల్స్ సలాడ్స్, హెల్దీఫుడ్ మాత్రమే తింటూ అందంగా, ఫిట్‌గా ఉంటారు. కానీ మనల్ని మాత్రం ఇలా ఆరోగ్యానికి మేలు చేయని జంక్ ఫుడ్ తినాలని ఎంకరేజ్ చేస్తుంటారని మండి పడ్డారు.

సమంత ఒక్కసారైనా ఫుల్ ప్యాక్ తింటుందా?
దాన్ని ప్రమోట్ చేస్తున్న సమంత... ఒక ప్యాకెట్ అయినా పూర్తిగా తింటుందా? వాళ్లకు వారి ఆరోగ్యం మీద, ఫిట్‌నెస్ మీదే శ్రద్ధ ఉంటుంది. సాధారణ ప్రజల గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోరు. అందుకే ఇలాంటి జంక్ ఫుడ్ తినేలా ప్రచారం చేస్తారు... అంటూ ఓ నెటిజన్ ఫైర్ అయ్యారు.

విమర్శలపై స్పందించిన సమంత
తనపై వస్తున్న విమర్శలపై సమంత స్పందించారు. నేను కూడా వాటిని తింటాను కాబట్టే ప్రమోట్ చేస్తున్నాను. ఆదివారం పూట నేను తినే ఫుడ్ ఫోటోలు మీకు పంపుతాను. ఎక్కువగా నియమాలతో కూడిన హెల్దీ ఫుడ్ తీసుకున్నప్పటికీ బోర్ కొట్టినపుడు కుర్‌కురే లాంటి స్నాక్స్ తింటాను అని సమంత రిప్లై ఇచ్చారు.

సమంత
సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం తన భర్త నాగ చైతన్యతో కలిసి ‘మజిలీ' చిత్రంలో నటిస్తోంది. దీంతో పాటు తమిళంలో ‘సూపర్ డీలక్స్', ‘ఓ బేబీ' అనే సౌత్ కొరియన్ మూవీ తెలుగు రీమేక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











