twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సమంత చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్!

    |

    స్టార్ హీరోయిన్ సమంత వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. సమంత నటించిన రెండు తెలుగు చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి. సమంత, నాగచైతన్య జంటగా నటించిన మజిలీ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. రియల్ లైఫ్ కపుల్స్ అయిన సామ్, చైతు ఈ చిత్రంలో కూడా భార్య భర్తలుగా నటిస్తున్నారు. ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకుడు. మరోవైపు సమంత ఓ బేబీ అనే లేడీఓరియేంటేడ్ చిత్రంలో కూడా నటిస్తోంది.

    తమిళంలోనూ సమంత జోరు తగ్గడం లేదు. సూపర్ డీలక్స్ అనే చిత్రంలో సమంత నటిస్తోంది. క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ తమిళ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ కార్యక్రమాలు ముగిశాయి. సెన్సార్ సభ్యులు సూపర్ డీలక్స్ చిత్రానికి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేశారు.

    Samanthas Super Deluxe movie completes censor

    విజయ్ సేతుపతి, ఫహాద్ ఫజిల్, రమ్య కృష్ణ కీలక పాత్రలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి ట్రాన్స్ జెండర్ గా నటిస్తుండగా, రమ్యకృష్ణ ఈ చిత్రంలో పోర్న్ స్టార్ గా నటిస్తోంది. ఈ సంచలన చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. త్యాగరాజన్ కుమారరాజా ఈ చిత్రాన్ని దర్శకుడు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

    English summary
    Samantha's Super Deluxe movie completes censor
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X