వచ్చే నెలలోనే ప్రేక్షకుల ముందుకు సమంత: ముహూర్తం ఫిక్స్ చేసేసిన ఫ్యామిలీ మ్యాన్
తెలుగు సినీ ఇండస్ట్రీలో చాలా కాలంగా టాప్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది అక్కినేని వారి కోడలు సమంత. కెరీర్ ఆరంభం నుంచే భారీ విజయాలను అందుకున్న ఆమె.. చాలా తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఏకధాటిగా విజయాలను సాధిస్తూ సత్తా చాటుతోంది. తెలుగులో మాత్రమే కాదు.. తమిళంలోనూ ఈమె ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. ఇలా ఇన్ని రోజులూ వెండితెరపై సందడి చేసిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్ ద్వారా డిజిటల్ వరల్డ్‌లోకి అడుగులు వేయబోతుంది.
మనోజ్ బాజ్‌పాయి, ప్రియమణి, సందీప్ కిషన్ ప్రధాన పాత్రలు పోషించిన స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్'. దీన్ని తెలుగు దర్శకులు రాజ్ నిడిమోరు, కృష్ణ డీకేలు తెరకెక్కించారు. ఎన్నో అంచనాల నడుమ వచ్చిన ఈ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలో దీనికి కొనసాగింపుగా.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2'ను రూపొందించారు. ఇందులో వాళ్లతో పాటు స్టార్ హీరోయిన్ అక్కినేని సమంత కూడా నటించింది. ఇది ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సి ఉన్నా.. అనివార్య కారణాలతో ఆగిపోయింది. తాజా సమాచారం ప్రకారం.. ఈ వెబ్ సిరీస్ మే రెండో వారంలో రాబోతుందట.

'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ను మే 10న కానీ 12న కానీ స్ట్రీమింగ్ చేయనున్నారని తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది. వాస్తవానికి ఇది ఫిబ్రవరిలోనే రిలీజ్ అవుతుందని ప్రకటించినా.. అప్పుడు సాధ్య పడలేదు. ఈ నేపథ్యంలోనే కొన్ని సీన్లు ఎడిటింగ్ చేసి ప్రేక్షకుల ముందుకు వదలబోతున్నారట.
ఇక, ఇందులో సమంత టెర్రరిస్టు పాత్రను పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ ఈ వెబ్ సిరీస్‌పై అంచనాలను అమాంతం పెంచేసింది.


Click it and Unblock the Notifications











