ఆ విషయంలో పుష్ప టీమ్ కు షాక్ ఇచ్చిన సమంత.. దానికి నో కండిషన్స్ కానీ ఇప్పుడు మాత్రం!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో సమంత ఓ ఐటమ్ సాంగ్ లో నర్తించిన విషయం తెలిసిందే. ఊ అంటావా మావా.. ఊహూ అంటావా అంటూ సాగే ఈ పాట యూట్యూబ్ లో ఓ ట్రెండ్ క్రియేట్ చేసింది. ఇంత వరకు బాగానే ఉన్నా ఈ పాటకు వివాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సన్గ్ విషయంలో షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆ వివరాల్లోకి వెళితే

సమంత స్పెషల్ సాంగ్

సమంత స్పెషల్ సాంగ్

ప్రపంచ వ్యాప్తంగా పుష్ప సినిమా 3000కు పైగా థియేటర్స్‌లో సందడి చేస్తోంది. సుకుమార్ బన్నీ కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం.. పైగా మునుపెన్నడూ కనిపించని మాస్ లుక్‌లో బన్నీ కనిపించనుండటంతో సినిమా మీద ఆసక్తి పెంచుతున్నారు. ఇక ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ లో చేసింది.

అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో

అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో

ఊ అంటావా.. ఊహు అంటావా మామ అంటూ సాగే ఈ పాట ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాట 'వినిపిస్తుంది.. కనిపిస్తుంది. అలాగే యుట్యూబ్ లో ఇప్పటికే 4.5 మిలియన్ కు పైగా వ్యూస్ దక్కించుకుంది. చాలా కాలం తర్వాత సమంత హాట్ గా కనిపించడంతో పాటు అదిరిపోయే ఎక్స్ ప్రెషన్స్ తో ఆకట్టుకుంటుంది.

ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాట

ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాట

చంద్రబోస్ రచించగా మంగ్లీ చెల్లెలు ఇంద్రావతి చౌహాన్ పాడిన ఈ పాట యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌తో వైరల్ అవుతోంది. అయితే ఈ పాట వీడియోను చిత్ర బృందం విడుదల చేయలేదు. పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో, ఆ పాటలో గ్లామర్ షో కోసం ఎటువంటి షరతులు విధించలేదని అల్లు అర్జున్ హింట్ ఇవ్వడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇంతలో, పుష్ప మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రమోట్ చేయాలని సమంతను కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

ప్రమోట్ చేసే అవకాశం లేదని

ప్రమోట్ చేసే అవకాశం లేదని

ఆమె చుట్టూ ఉన్న హైప్ మరియు వివాదాలను సినిమా కోసం ఉపయోగించుకోవాలని వారు ఆశించారు. కానీ నటి స్ట్రిక్ట్ గా తెలుగు మీడియా ముందు కనిపించనని చెప్పింది. సమంతా హిందీ మీడియా ముందుకు కావాలంటే వస్తానని అన్నారు. నాగ చైతన్య మరియు వారి విడాకుల గురించి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున తెలుగు మీడియాను ఎదుర్కోవడానికి తాను ఇంకా సిద్ధంగా లేనని నటి చెప్పిందట.

సినిమా విడుదల అయిన క్రమంలో ఆమె ప్రమోట్ చేసే అవకాశం లేదని సన్నిహితులు చెబుతున్నారు. అయితే ఆ పాట వీడియో అంచనాలకు, హైప్‌కు చేరువైతే సినిమాకు సరిపోతుంది.

ఏకంగా 5 కోట్లు ఖర్చు

ఏకంగా 5 కోట్లు ఖర్చు

ఈ పాట సినిమాకు ఒక హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ చెబుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ పాట కోసం మేకర్స్ ఏకంగా 5 కోట్లు ఖర్చు చేశారట. ఈ ఒక్క సాంగ్‌ కోసమే సమంతకు సుమారు కోటిన్నరకు పైగా రెమ్యునరేషన్ ఖర్చు పెట్టారని తెలుస్తోంది. దీంతో పాటు భారీ సెట్టింగ్‌తో విజువల్‌ వండర్‌గా తెరకెక్కించగా సినిమాలో కూడా ఆకట్టుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X