Samantha: 'కింద పడ్డానంతే' అంటూ షాకింగ్ గా సమంత.. లేటెస్ట్ పోస్ట్ వైరల్
సమంత.. ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తర్వాత అగ్ర హీరోల సరసన వరుస సినిమాలు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సమంత లైఫ్‌ను పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత అంటూ పోల్చి చూడొచ్చు. సాధారణంగానే పెళ్లిల్లు అయ్యాక హీరోయిన్లకు సినిమా అవకాశాలు అంతగా రావు. అలాంటిది నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత కూడా ఏమాత్రం జోరు తగ్గకుండా వరుస సినిమాలు చేసి, అంతకుమించిన పాపులారిటీని సంపాదించుకున్న నటి ఎవరైనా ఉంటే అది సమంతనే అని చెప్పవచ్చు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాకు సమంత దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఆమె తాజాగా పెట్టిన ఓ పోస్ట్ ఆసక్తి కలిగిస్తోంది.

హిట్ పెయిర్‌గా రికార్డు..
గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో నాగ చైతన్య, సమంత జోడిగా నటించి సూపర్ హిట్ కొట్టారు. ఆ సినిమా వారిద్దరికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అనంతరం వీరిద్దరు కలిసి అటో నగర్ సూర్య, మనం, మజిలి వంటి చిత్రాల్లో నటించి హిట్ పెయిర్‌గా రికార్డుకెక్కారు. ఆన్‌స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్‌లో సైతం బ్యూటిఫుల్ కపుల్‌గా అందరి దృష్టిని ఆకర్షించారు. నాలుగేళ్ల వైవాహిక జీవితం తర్వాత సడెన్‌గా సినీ లోకానికి షాక్ ఇచ్చారు.

రూ. 250 కోట్ల భరణం తీసుకుందని..
అక్టోబర్ 2, 2021 తాము విడిపోతున్నట్లు ప్రకటించి నాగ చైతన్య, సమంత ప్రేక్షక లోకాన్ని షాక్‌కు గురి చేశారు. ఇక దీని తర్వాత ఎక్కవగా అందరూ సమంతను టార్గెట్ చేస్తూనే పోస్టులు పెట్టడం, వారికి దీటుగా కౌంటర్ ఇవ్వడం వంటివి చాలానే జరిగాయి. సమంత రూ. 250 కోట్ల భరణం తీసుకుందని వంటి రూమర్లు చాలా వచ్చాయి. వాటిపై కాఫీ విత్ కరణ్ టాక్ షోలో క్లారిటీ కూడా ఇచ్చింది సామ్.

విడాకుల తర్వాత మరింత యాక్టివ్‌గా..
సాధారణంగానే సమంత సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటుంది. ఇక నాగ చైతన్యతో విడాకుల తర్వాత మరింత యాక్టివ్‌గా ఉండేది. అప్పటినుంచి ఆమె ఏ పోస్ట్ పెట్టిన, ఎలాంటి కామెంట్ చేసిన వెంటనే వైరల్ అయిపోయేది. తను వెళ్లే టూర్లు, వెకేషన్స్, మోటివేషనల్ కొటేషన్స్, ఫిట్నెస్ తదితర విషయాలపై పోస్ట్‌లు, వీడియోలు పోస్ట్ చేసేది సమంత. అలాంటి సామ్ గత కొంతకాలంగా సైలెంట్ అయిపోయిందని తెలిసిందే.

గర్భసంచి తొలగించుకుందని..
ఆమెకు సంబంధించిన టాక్ ఏం బయట వినిపించలేదు. అలాగే సోషల్ మీడియాలో ఎలాంటి పోస్ట్‌లు గానీ పెట్టలేదు. అయితే సామ్.. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన న్యూసే.. పెట్టకున్న వార్తే అన్నట్లుగా మారింది. అలాంటిది ఆ మధ్య కొన్ని రోజులు సమంత సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేదు. అందుకు ఆమె గర్భసంచి తొలగించుకుందని, చర్మ సంబంధిత సమస్యలు రావడంతో ఆస్పత్రిపాలైనట్లు వార్తలు గుప్పుమన్నాయి.

సమంత టీమ్ క్లారిటీ..
కానీ ఆ వార్తలన్ని అవాస్తవమని, అన్ని పుకార్లే అని సమంత టీమ్ క్లారిటీ ఇచ్చింది. దీంతో ఈ రూమర్స్ కు చెక్ పడినట్లయింది. అయితే తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ అకౌంట్ లో ఓ పోస్ట్ పెట్టింది గ్లామరస్ బ్యూటి సమంత. ఈ పోస్ట్ లో తన పెంపుడు కుక్క ఫొటో షేర్ చేసింది సామ్. ఈ ఫొటోకు ''డౌన్ నాట్ అవుట్'' అని రాసుకొచ్చింది. అంటే ఇంకా పడిపోలేదని, ఇంకా ఓడిపోలేదని, 'కింద పడ్డాను అంతే.. కానీ, అవుట్ కాలేదు' అని మీనింగ్ వచ్చేలా ఉంది.

విభిన్నమైన క్యాప్షన్స్ తో..
ఈ పోస్ట్.. ఆ కామెంట్ అదే క్యాప్షన్ చూసి షాక్ అవుతారు నెటిజన్లు. ఎందుకు అలా పెట్టారు అంటూ కామెంట్స్ రూపంలో అడుగుతున్నారు. ఇంతకుమందు కూడా ఇలానే విభిన్నమైన క్యాప్షన్స్ తో కొత్త అర్థాలను సమంత చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఓ ఇంటర్నేషనల్ మూవీకి..
ఇక సమంత సినిమాల విషయానికొస్తే.. సామ్ వరుసగా పాన్ ఇండియా మూవీస్‌తో ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో యశోద, శాకుంతలం, ఖుషి సినిమాల్లో నటిస్తోంది సామ్. ఈ మూడు చిత్రాలు పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. అలాగే హిందీలో ఆయుష్మాన్ ఖురానా, అక్షయ్ కుమార్, తాప్సీ ప్రొడక్షన్లో పలు చిత్రాలకు ఓకే చెప్పిందని సమాచారం. దీంతోపాటు ఓ ఇంటర్నేషనల్ మూవీకి సామ్ పచ్చ జెండా ఊపిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











