మానసిక సమస్యలు ఎదుర్కొన్నా.. వాళ్ళ వల్లే బయటపడ్డా.. ఎట్టకేలకు బయట పెట్టిన సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నటిస్తున్న సమంత వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ఊ అంటావా.. ఊహు అంటావా పాట చేసి పుష్పతో హిట్ అందుకుని మంచి జోష్ మీదుంది సమంత. అయితే ఆమె ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు

ప్రతి రోజూ పోస్ట్‌లు
అక్కినేని నాగచైతన్యతో విడాకులు ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టింది. వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు సమన్తా ప్రయత్నిస్తోంది. ఇక మరో పక్క ఆమె ఇన్ స్టాలో మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు పెడుతుంది. అది సినిమాకు సంబంధించిందా? లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిదా? తన వ్యాపారానికి సంబంధించిందా? తన వర్కవుట్ల విషయాలా? అన్నది పక్కన పెడితే సమంత మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు చేస్తూనే ఉంటుంది. ఆమె చేస్తున్న అన్ని పోస్టులు ప్రత్యేక చర్చలకు దారి తీస్తున్నాయి.

మానసిక సంఘర్షణ
ఇక అమ్మ చెప్పింది అంటూ పెట్టే కొటేషన్లు, ఎక్కడెక్కడో ఉన్న సూక్తులు తీసుకుని వచ్చి మరీ ఆమె తన జీవితంతో రిలేట్ చేస్తూ షేర్ చేస్తుంటుంది. అలాగే తన స్నేహితులతో కలిసి ఒక డివోషనల్ ట్రిప్, మరో ఎంజాయ్ మెంట్ ట్రిప్ వేసిన ఆమె ఇప్పుడిప్పుడే మళ్ళీ షూటింగ్స్ లో బిజీ అవుతోంది. ఇక అయితే ఆమె గత కొద్దిరోజులుగా విడాకుల తర్వాత తాను ఎదుర్కొన్న పరిస్థితులు.. మానసిక సంఘర్షణ గురించి అనేక ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది

వైద్య సహాయం తీసుకున్నా
తాజాగా మరోసారి తన మానసిక సంఘర్షణ గురించి సమంత సంచలన విషయాలు బయట పెట్టింది. తాజాగా ఆమె మాటలాడిన మాటలు చర్చనీయాంశం అవుతున్నాయి. రోష్ని ట్రస్ట్ ఏర్పాటు చేసిన సైకియాట్రి ఎట్ యువర్ డోర్ స్టెప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ జీవితంలో తాను చాలా మానసిక సమస్యలు ఎదుర్కొన్నానని పేర్కొంది. ఇలాంటి సమయంలో నా స్నేహితులు, వైద్య సహాయం తీసుకున్నా అని పేర్కొంది.

వరుస చిత్రాలతో
అలా నేను ఈరోజు ధైర్యంగా నిలబడటానికి.. జీవితంలో ముందుకు వెళ్లడానికి నా స్నేహితులు, కుటుంబం, కౌన్సిలర్ల సహాయమే కారణం అని ఆమె చెప్పుకొచ్చింది. శరీరానికి దెబ్బ తగిలితే వైద్యులను ఎలాగైతే కలుస్తామో అలాగే మనసుకు గాయం అయినప్పుడు కూడా వైద్యులను సంప్రదించాలని సమంతా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం సమంత వరుస చిత్రాలతో దూసుకుపోతుంది. ఇటీవల పుష్ప సినిమాలో ఊ అంటావా మావ.. ఊహు అంటావా పాటతో అదరగొట్టిన సమంత ప్రస్తుతం యశోద సినిమా చేస్తుంది.

సినిమాల విషయానికి వస్తే
ఇక సమంత నటించిన శాకుంతలం సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది ఆమె. ఆమె ది అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్' అనే అంతర్జాతీయ సినిమా ద్వారా హాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఇక హిందీ హీరో వరుణ్ ధావన్ తో కలిసి అమెజాన్ ప్రైమ్ సిరీస్ 'సిటాడెల్'లో కూడా ఆమె నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











