500 కోసం అలా చేశా.. డబ్బు లేక రెండు నెలలు ఒక్కపూట భోజనం.. బాధలు బయట పెట్టిన సమంత
టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా నటిస్తున్న సమంత వరుస చిత్రాలతో బిజీ బిజీగా గడిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పుష్ప సినిమాలో ఊ అంటావా.. ఊహు అంటావా అనే ఐటెం సాంగ్ చేసి పుష్ప హిట్ అందుకుని మంచి జోష్ మీదుంది. అయితే ఆమె ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాలు

ప్రతి రోజూ పోస్ట్‌లు
అక్కినేని నాగ చైతన్యతో విడాకులు ప్రకటన అనంతరం సమంత తన కెరీర్ మీద దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. వరుస సినిమాలతో బిజీ అయ్యేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తోంది. అయితే మరో పక్క ఆమె ఇన్ స్టాలో మాత్రం ప్రతి రోజూ పోస్ట్‌లు పెడుతూ ఉంటుంది. అయితే సినిమాల అప్డేట్స్ అనే వాటి పెకంటే ఎక్కువగా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలే ఎక్కువ షేర్ చేస్తూ తన బాధ బయట పెట్టె ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అందుకే ఆమె చేస్తున్న అన్ని పోస్టులు ప్రత్యేక చర్చలకు దారి తీస్తున్నాయి.

మానసిక సంఘర్షణ
ఇక అమ్మ చెప్పింది అంటూ సమంత ఎక్కడెక్కడో కొటేషన్స్, సూక్తులు తీసుకుని వచ్చి మరీ ఆమె షేర్ చేస్తుంటుంది. ఇక ఎక్కువగా ఆమె అయితే షూటింగ్ లో లేదంటే తన స్నేహితులతో వెకేషన్ లో ఉండడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా డివోషనల్ మొదలు ఎలాంటి ట్రిప్ అయినా హ్యాపీగా చెక్కేస్తోంది. అలాగే కొద్ది రోజుల క్రితం స్విట్జర్ లాండ్ వెకేషన్ లో కనిపించిన ఆమె ఆ తర్వాత ఇండియా చేరింది.

ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా
అసలు విషయం ఏమంటే సమంత తన కెరీర్ తొలినాళ్ళ గురించి సంచలన విషయాలు బయట పెట్టింది. ఇప్పుడంటే వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నాను కానీ సినిమా పరిశ్రమకు రాకముందు నేను కూడా సినిమా కష్టాలు అనుభవించానని ఆమె చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీకి రాక ముందు సాధారణ అమ్మాయిలా ఎన్నో కష్టాలను ఎదుర్కొంన్నానని ఆమె వెల్లడించింది.

వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా
తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సమంత ఈ విషయాలను అందరితో పంచుకుంది. అందరు మిడిల్ క్లాస్ అమ్మానాన్నల లాగే వారి కోరిక మేరకు బాగా చదివి టాపర్‌గా నిలిచేదాన్ని అని చెప్పిన సమంత పై చదువులకు డబ్బులు లేక చదువు మానేయాల్సి వచ్చిందని ఆమె చెప్పుకొచ్చింది. ఇక ఈ గ్లామర్ వరల్డ్ లోకి రాక ముందు పెద్ద పెద్ద ఫంక్షన్స్‌కు హాజరయ్యే గెస్ట్‌లకు వెల్‌కమ్ చెప్పే అమ్మాయిగా వెళ్లే దానిని అని చెప్పుకొచ్చారు.
Recommended Video

ఒక్కపూట భోజనంతో
అలా వెల్‌కమ్ చెప్పినందుకు గాను రోజుకు రూ. 500 ఇచ్చేవారని ఆమె వెల్లడించింది. ఇక ఒకానొక సమయంలో డబ్బు లేక ఒక్కపూట భోజనంతో దాదాపు రెండు నెలలు గడిపినట్లు సమంత చెబుతూ ఎమోషనల్ అయింది. పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేయడానికి చూస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కొందరు నీకు ఇది అవసరమా అంటూ వెనక్కి లాగే ప్రయత్నం చేశారు, కానీ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఇక్కడిదాకా వచ్చానని సమంత వెల్లడించింది.


Click it and Unblock the Notifications











