Samantha: పబ్లిక్‌గా ఆ పని చేసిన సమంత.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియో
Samantha: హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్‌లో సమంత కూడా ఒకరు. ఈ అమ్మడు తన సినిమాలతో ప్రత్యేక మార్కెట్‌ను ఏర్పర్చుకోవడమే కాదు. తనకంటూ ప్రత్యేకమైన ప్యాన్ బేస్‌ను ఏర్పరుచుకున్నారు. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ కంటెంట్ తో దూసుకుపోతుంది. రీసెంట్‌గా ఈ అమ్మడుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఈ వీడియోలో ఏముందో ఓ లూక్కేయండి.
'ఏమాయ చేసావే' సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది సమంత. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకులను తన అందం, అభినయంతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఫస్ట్ సినిమా హిట్ కావడంతో సమంతకు దర్శక, నిర్మాతలు వరుస అవకాశాలు ఇచ్చారు. అలాగే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, మహేశ్, ఎన్టీఆర్ లాంటి అగ్రహీరోల సరసన నటించి.. అతి తక్కువ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకుంది.

ఈ తరుణంలోనే తన తొలి హీరో అక్కినేని నాగచైతన్యతో ప్రేమలో పడింది. కొన్నాళ్లకు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది బెస్ట్ స్టార్ కపుల్ గా తెచ్చుకున్న వీరి బంధం తెగిపోయింది. ఇరువుల మధ్య మనస్పర్థలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఈ అనూహ్య నిర్ణయంతో అక్కినేనీ ఫ్యాన్స్ మాత్రమే కాదు. మూవీ లవర్స్ షాక్ గురి చేశారు. వ్యక్తిగత జీవితంలో ఓడినా.. తన నటనతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది సమంత. కోట్లాది మంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సంపాదించుకుంది.ఒక్క పోస్ట్ పెడితే చాలా క్షణాల్లో లైక్‌లు, కామెంట్లతో సోషల్ మీడియా షేక్ అవుతుంటుంది.
ఇదెలా ఉంటే.. నాగచైతన్య నుంచి విడాకుల తర్వాత సమంత మయోసైటీస్ (Myositis) అనే వ్యాధి బారినపడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వ్యాధి నివారణకు విదేశాల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు టాక్. ఈ వ్యాధితో బాధపడుతున్న సమంత దాదాపు సంవత్సరం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంది. తన ఆరోగ్యం మెరుగుపడ్డ తరువాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది సమంత. అయితే.. టాలీవుడ్ దూరంగా ఉంటూ.. వెబ్ సిరీస్ పై ఫోకస్ పెట్టింది సమంత. ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ (Honey - Bunny) వెబ్ సిరీస్ లో నటిస్తోంది సమంత.
#SamanthaRuthPrabhuhot #Samantha pic.twitter.com/g5dVTPjIpg
— Rain Cinema (@cinema_rain) October 24, 2024
ప్రస్తుతం సిటాడెల్ హనీ బన్నీ (Honey - Bunny) వెబ్ సిరీస్ ప్రమోషన్లలో సమంత ఫుల్ బిజీబిజీగా మారింది. ఓ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనడానికి డిజైనర్ ద్వారా ఓ స్పెషల్ డ్రెస్ ను డిజైన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆ డ్రెస్ చేసుకుంటున్నప్పుడూ తీసిన వీడియో ట్రెండింగ్‌లో ఉంది. ఈ వీడియో సమంత అందాల బొమ్మలా నిల్చుని ఉన్నారు. ఇలా ఉద్యోగం వస్తే జీతం కూడా అక్కర్లేదు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇదెలా ఉంటే.. సిటాడెల్ వెబ్ సిరీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కింది. ఈ సిరీస్ లో వరుణ్ ధావన్, సమంత , సిమ్రాన్ ప్రధాన పాత్రల్లో నటించారు.సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ OTT ప్లాట్‌ఫామ్‌లో విడుదల కానుంది. దీపావళి కానుకగా విడుదలైన ఈ సీరిస్ లో సమంత .. హనీ అనే పాత్రలో స్పై ఏజెంట్‌గా నటించిందట. ఈ సిటాడెల్ సిరీస్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వచ్చింది. బాలీవుడ్ ప్రముఖులు కూడా దీనిపై ప్రశంసలు కురిపించారు. ఈ సిరీస్ కోసం కోట్లాది మంది అభిమానులు వేచి ఉన్నారు.


Click it and Unblock the Notifications











