Samantha : నాగచైతన్య కంటే సమంత 14 ఏళ్లు చిన్నదా? ఇదేం ట్విస్ట్ బాసు!
ఏంటి టైటిల్ వినగానే షాక్ అండ్ స్టన్ అయ్యారా? నాగ చైతన్య కన్నా సమంత 14ఏళ్ల చిన్నది ఏంటా అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు చదివిన విషయమే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అంతా దీని గురింటే మాట్లాడుకుంటున్నారు. అసలు విషయమేమిటో స్టోరీలోకి వెళ్లి తెలుసుకుందాం..
వివరాల్లోకి వెళితే. టాలీవుడ్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు గురించి తెలిసిందే. సోషల్ మీడియాలో ఎప్పుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది. అయితే ఈ ముద్దుగుమ్మ తన మాజీ భర్త నాగచైతన్యతో విడిపోయి చాలా కాలమే అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగానే ఒంటరిగానే గడుపుతున్నారు. ఎవరి ప్రొఫెషనల్ లైఫ్స్‌తో వారు బిజీ బిజీగా గడుపుతున్నారు.

అయితే సామ్ మాత్రం ఏడాదికిపైగా నుంచి మయోసైటిస్ రోగంతో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఏడాది పాటు నుంచి విదేశాల్లో షికార్లు కొడుతూ తిరుగుతోంది. మధ్య మధ్యలో ఇండియాకు తిరిగి వస్తోంది. అలానే తన రోగానికి సంబంధించిన చికిత్సను కూడా తీసుకుంటూ మనసు ప్రశాంతత చేసుకుని జీవిస్తోంది. రీసెంట్గా తనలా ఇంకెవరికి జరగకూడదని 'టేక్ 20' అనే హెల్త్ పాడ్ కాస్ట్‌ను ప్రారంభించి రోగానికి సంబంధించి, అలానే ఆరోగ్యంగా ఎలా ఉండాలనే విషయంపై అవగాహన కల్పిస్తోంది. ప్రముఖ ఆరోగ్య నిపుణుడి విలువైన సలహాలతో ఈ సమాచారం అందిస్తున్నట్లు పేర్కొంది.
అయితే తాజాగా సామ్‌కు సంబంధించి షాక్ అండ్ సర్ప్రైజ్ అయ్యే విషయం ఒకటి బయటకు వచ్చింది. సామ్. చైతూ కన్నా ఆమె 14ఏళ్లు చిన్నదని తెలిసింది. ప్రస్తుతం దీని గురించి సోషల్ మీడియా అంతా చర్చ జరుగుతోంది. ఎందుకంటే... సామ్ ఎప్పటిలానే తన వర్కౌట్‌కు సంబంధించిన పిక్స్‌ను షేర్ చేసింది. ఇందులో తన చుట్టూ ఉన్న లొకేషన్ అందాలను చూపించింది.

అలాగే తన హెల్త్ అప్డేట్ ఉన్న ఓ పేపర్‌ను కూడా పోస్ట్ చేసింది. ఇందులోనే సామ్ మెటబాలిక్ అని కనిపించింది. అలానే ఆమె బరువు 50 కేజీలు, ఫ్యాట్, బోన్స్, BMR.. ఇలా ఆమె ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ పోస్టే వైరల్ అవుతోంది. అలా సామ్ మెటబాలిక్ ఏజ్ 23 ఏళ్ళే అని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. అసలు మెటబాలిక్ ఏజ్ అంటే ఏంటి అని కూడా ఆరా తీస్తున్నారు.
సాధారణంగా మన వయసును పుట్టినప్పటి నుంచి లెక్కేస్తారు. కానీ మెటబాలిక్ ఏజ్ అనేది మన శరీర ఆర్యోగాన్ని బట్టి లెక్కిస్తారు. మన నిజమైన వయసు కన్నా మెటబాలిక్ వయసు తక్కువగా ఉంటే మనం చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు అర్థమట. ఇకపోతే సమంత ప్రస్తుతం బ్యాక్ టు వర్క్ ప్రొఫెషనల్ లైఫ్‌లో అడుగుపెట్టింది. ఈ మధ్య ఇండియన్ వెర్షన్ సిటాడెల్ డబ్బింగ్ వర్క్ పూర్తి చేసింది. త్వరలోనే కొత్త సినిమాలకు సైన్ చేసి షూటింగ్లలో పాల్గొంటుంది.


Click it and Unblock the Notifications











