పాప చనిపోయింది, అదే రోజు సమంత పుట్టినరోజు... సెట్స్‌లో ఏడ్చేసింది!
సౌత్‌లో టాప్ హీరోయిన్‌గా ఎదిగిన సమంత... ప్రత్యూష ఫౌండేషన్ అనే ఎన్టీవోకు తనవంతు సహకారం అందిస్తున్న సంగతి తెలిసిందే. పిల్లలకు, మహిళలకు మెడికల్ సపోర్ట్ ఇవ్వడమే లక్ష్యంగా ఈ ఫౌండేషన్ పని చేస్తోంది. ఈ సంస్థకు నిధులు సమకూర్చడం కోసం సమంత పలు చారిటీ కాక్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.
ప్రత్యూష ఫౌండేషన్ బాధ్యతలు చూసుకుంటున్న శశాంక బినేష్ తాజాగా...... తాజాగా 'అఫీషియల్ హ్యూమన్స్ ఆఫ్ హైదరాబాద్' ఇన్‌స్టా పేజీలో తన స్టోరీ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె ప్రత్యూష ఫౌండేషన్‌తో తన జర్నీ గురించి వివరించారు. ఇందులో సమంత గురించి కూడా పేర్కొన్నారు. 2014లో ప్రత్యూష ఫౌండేషన్ మొదలైనప్పటి నుంచి సమంత, డాక్టర్ మంజులతో పాటు శశాంక బినేష్ కూడా ఈ ఎన్టీఓ కోసం పని చేస్తున్నారు.

రెండు రోజుల తర్వాత చనిపోయింది
ప్రత్యూష ఫౌండేషన్ మొదలు పెట్టిన తర్వాత మేము హ్యాండిల్ చేసిన ఫస్ట్ కేసు మాకు ఇంకా గుర్తుంది. బేబీ సనా కాలేయ మార్పిడి చికిత్స కోసం మేము 15 లక్షలు ఫండ్ కలెక్ట్ చేశాం. సనా తల్లిదండ్రులకు ఎలాంటి ఫైనాన్సియల్ సపోర్ట్ లేదు. లవ్ మ్యారేజ్ కావడంతో వారి కుటుంబ సభ్యులు కూడా సాయం చేయడానికి ముందుకు రాలేదు. సర్జరీ పూర్తయిన రెండు రోజులకు ఆ బేబీ చనిపోయింది.

సెట్స్‌లో సమంత ఏడ్చేసింది
ఆ సమయంలో సమంత రభస మూవీ షూటింగులో ఉంది. అదే రోజు సమంత పుట్టినరోజు కూడా. ఈ విషయం తెలియగానే సమంత చాలా అప్ సెట్ అయింది. సెట్స్ లోనే ఏడ్చేసింది. ఆ సంఘటన సమంతతో పాటు మమ్మల్ని చాలా బాధ పెట్టింది.

ఇప్పటి వరకు 547 మందిని కాపాడాం
ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మేము 547 మంది ప్రాణాలు కాపాడటం జరింది. మా ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉంది. మేము ఈ పని చేస్తున్నందుకు ఎంతో గర్విస్తున్నాం. పిల్లలు, మహిళల ప్రాణాలు కాపాడటానికి వీలైనన్ని నిధులు ప్రజల నుంచి కలెక్ట్ చేస్తున్నాం. ఇందులో ఎక్కువ శాతం సమంత నుంచి సహాయం అందుతోంది. సమంత ప్రోత్సాహం, సపోర్ట్ మమ్మల్ని మరింత స్ట్రాంగ్ చేసింది... అని శశాంక బినేష్ తెలిపారు.
నిన్ను చూస్తే గర్వంగా ఉంది: సమంత
ప్రత్యేక ఫౌండేషన్ కోసం నువ్వు చేస్తున్న సేవలు మరువ లేనివి. నిన్ను చూస్తే గర్వంగా ఉంది అంటూ.... శశాంక బినేష్ గురించి సమంత వ్యాఖ్యానించారు.


Click it and Unblock the Notifications











