ముందుంది ముసళ్ల పండగ.. గుర్తు పెట్టుకో.. సమంత పోస్ట్ వైరల్

సమంత నాగచైతన్య విడాకులు ప్రకటన తర్వాత సమంత సోషల్ మీడియా ను జనం ఎక్కువగా ఫాలో అవుతున్నారు. ఆమె తన సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ పెట్టినా వెంటనే వైరల్ చేస్తున్నారు. తాజాగా సమంత పెట్టిన పోస్ట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

మరింత యాక్టివ్గా

మరింత యాక్టివ్గా

నాగచైతన్య తో విడిపోయిన అప్పటి నుంచి సమంత ఎక్కువగా సోషల్ మీడియాలో గడపడానికి సమయం వెచ్చిస్తున్నారు. ముందు నుంచి కూడా సమంత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండేది కానీ విడాకుల ప్రకటన తర్వాత ఆమె మరింత యాక్టివ్గా ఉండటం మొదలు పెట్టారు.. తన ఫీలింగ్స్ తన బాధలు తన ఇబ్బందులు అన్నింటినీ సోషల్ మీడియా వేదికగా ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.

ఏదైనా మంచి

ఏదైనా మంచి

తాజాగా సమంత పెట్టిన పోస్ట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. ఆమె నేరుగా పోస్టులు పెట్టడం లేదు కానీ కొటేషన్స్ షేర్ చేసే పేజీ లకు సంబంధించిన పోస్టులు ఆమె తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా షేర్ చేస్తోంది. ఎప్పుడూ నిరాశతో, లేదా ఎమోషనల్‌ కోట్స్‌ షేర్‌ చేసే సమంత ఈసారి ఓ ఆసక్తికర కోట్‌ని షేర్ చేసింది. 'గుర్తు పెట్టుకోండి.. ఎల్లప్పుడూ ఏదైనా మంచి జరుగుతూనే ఉంటుంది' అని రాసి ఉన్న ఫొటో ను పంచుకుంది.

దీంతో సమంత కాస్త బాధ నుంచి బయట పడే ప్రయత్నం చేస్తోందని, కొందరు సంతోష పడుతుంటే మరి కొందరు మాత్రం ఆమె సంతోషించే న్యూస్‌ ఏదో తన వద్దకు చేరినట్టుందంటూ చర్చించుకుంటున్నారు.

3 కోట్లు

3 కోట్లు

అలాగే స‌మంత గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఆమె త్వరలో మొద‌లుపెట్ట‌బోతున్న ఓ తెలుగు సినిమాకు త‌న రెమ్యున‌రేష‌న్ పెంచేసింద‌నేది సదరు వార్త సారాంశం. ఇప్పటి నుంచి కొత్త సినిమాకు సమంత రూ.3 కోట్లు తీసుకుంటుంద‌ని ప్రచారం జరిగింది. అలా ఆమె దీంతో ప్ర‌స్తుతం తెలుగులో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరోయిన్‌గా నిలిచిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమచారం అయితే వెల్లడి కావాల్సి ఉంది.

సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో నటిస్తున్నట్లు చెబుతున్నారు. సమంత తన తదుపరి చిత్రాన్ని డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌తో చేయబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన దసరా సందర్భంగా విడుదలైంది. కొత్త డైరెక్టర్‌ శాంతరూబన్‌ జ్ఞానశేఖరన్‌ డైరెక్షన్‌లో సమంత ఈ సినిమా చేయనున్నారు.

Recommended Video

Samantha Is Super Excited For Marvel Studios 'Eternals'
అక్కడొకటి-ఇక్కడొకటి

అక్కడొకటి-ఇక్కడొకటి

ప్రొడక్షన్‌ నెం.30 అనే వర్కింగ్‌ టైటిల్‌తో దసరా సందర్భంగా ఓ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సినిమా తెలుగు, తమిళంలో ఒకేసారి తెరకెక్కనుంది. మరో పక్క ఆమె తమిళంలో విజయ్‌ సేతుపతితో 'కాత్తు వాక్కుల రెండు కాదల్‌' అనే సినిమా చేస్తోంది. అలాగే ఆమె గుణశేఖర్ దర్శకత్వంలో తెలుగులో నటించిన 'శాకుంతలం' మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకోగా అది విడుదలకు సిద్దమవుతోంది. మరి సమంత గుడ్ న్యూస్ ఎప్పటికి వెల్లడి కానుందో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X