Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
జీవితం లో నేను నేర్చుకున్న గొప్ప గుణపాఠం అదే.. సంచలనం రేపుతున్న సమంత తాజా పోస్ట్
నాగ చైతన్యతో ప్రేమ, ఆ తర్వాత పెళ్లి కూడా చేసుకున్న సమంత ఈ మధ్యనే తాము ఇద్దరం విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి విడాకుల ప్రకటన తర్వాత కూడా ఎక్కువగా సమంత చేస్తున్న సోషల్ మీడియా పోస్టులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. విడాకుల వ్యవహారం తర్వాత సమంత చాలా బాధ పడుతున్న విషయాన్ని ఈ పోస్టుల ద్వారా వెల్లడిస్తోంది. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఆ వివరాల్లోకి వెళితే

పెద్దలను ఒప్పించి
ఏం మాయ చేశావే సినిమాలో అక్కినేని నాగచైతన్య సమంత ఇద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాత ఇద్దరూ ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు.. వీరి ప్రేమ మొదలు వివాహం దాకా ప్రతి విషయం కూడా చర్చనీయాంశమైంది. అయితే అనూహ్యంగా అక్కినేని సమంత అని ఉండే సోషల్ మీడియా అకౌంట్ లో అక్కినేని పేరు తొలగించి సమంత ఎస్ అనే అక్షరం పెట్టుకోవడంతో నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నారు అని ప్రచారం జరిగింది..

ఇద్దరం విడి పోతున్నామని
ఆ ప్రచారం జరిగినట్లుగానే అక్టోబర్ 2వ తేదీన తాము ఇద్దరం విడి పోతున్నామని సమంత నాగచైతన్య ఒకే సమయంలో అధికారికంగా ప్రకటించారు. వీరు నుంచి విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత విడాకులకు కారణం సమంతే అని చాలామంది ప్రచారం చేస్తూ వచ్చారు. ఈ విషయం మీద ముందు కొంత క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించిన సమంత ఈ విశ్లేషణలు ఆగకపోవడంతో కూకట్పల్లి కోర్టులో పరువు నష్టం దావా కూడా వేసింది. అలా మొత్తం మీద ఈ వ్యవహారంతో అందరి నోళ్ళు మూయించగలింది.

ఇన్స్టాగ్రామ్లో సమంత షేర్
అయితే ఇన్స్టాగ్రామ్లో సమంత షేర్ చేస్తున్న సూక్తులు ఈ మధ్య బాగా వైరల్ అవుతున్నాయి. ప్రేమ, నిజం, ధర్మం, రాక్షసులు, మంచివాళ్లు అంటూ నిత్యం ఆమె ఏదో ఒక విషయం మీద మంచి మంచి సూక్తులు పెడుతోంది. తాజాగా ఇన్స్టాలో ఆమె మరో సూక్తిని షేర్ చేసింది. 'జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద గుణపాఠం ఏమిటంటే.. నేను ఇంకా ఎంతో నేర్చుకోవాల్సి ఉంది' అనే పోస్ట్ షేర్ చేసింది.

మరో కొటేషన్
ఆ
తరువాత
ఆమె
మరో
కొటేషన్
కూడా
షేర్
చేసింది.
''చాలా
విషయాలు
బాగానే
ఉంటాయి,
కానీ
అన్నీ
ఉండవు.
కొన్నిసార్లు
మీరు
మంచి
పోరాటం
చేసి
ఓడిపోతారు.
కొన్నిసార్లు
మీరు
చాలా
గట్టిగా
పట్టుకుంటారు
మరియు
వదిలివేయడం
తప్ప
వేరే
మార్గం
లేదని
తెలుసుకుంటారు.
అంగీకారం
ఒక
చిన్న,
నిశ్శబ్ద
గది
అంటూ
ఆమె
పేర్కొంది.

సమంత సినిమాల విషయానికి వస్తే
ఇక
సమంత
సినిమాల
విషయానికి
వస్తే
ఆమె
వరుస
సినిమాలు
ఒప్పుకున్న
సంగతి
తెలిసిందే.
సమంత
డ్రీమ్
వారియర్
పిక్చర్స్‌తో
ఒక
సినిమా,
శ్రీదేవి
మూవీస్
బ్యానర్‌పై
ఓ
కొత్త
సినిమా
చేస్తున్నారు.
దీనికి
సంబంధించిన
అధికారిక
ప్రకటన
కూడా
విడుదలైంది.
ఈ
సినిమాను
హరీష్
నారయణ్,
హరి
శంకర్
దర్శకత్వం
వహించనున్నారు.
ఈ
సినిమా
గురించి
పూర్తి
వివరాలు
త్వరలో
ప్రకటించనుంది
సినిమా
యూనిట్.