చీరలో అల్లు అర్జున్ భార్య.. హాట్ అంటూ నిప్పులంటి కామెంట్ చేసిన స్టార్ హీరోయిన్!

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ మెంబర్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోలలో అర్జున్ కూడా టాప్ లిస్టులో ఉంటాడు అని చెప్పవచ్చు. అతను వెండితెరపై ఎంత స్టైలిష్ గా కనిపించినా కూడా కుటుంబం విషయానికి వచ్చేసరికి మాత్రం చాలా సింపుల్ గా మారిపోతూ ఉంటాడు. పెళ్లికాకముందు అల్లు అర్జున్ వివిధ రకాల పార్టీలతో చాలా బాగా ఎంజాయ్ చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత తనకంటూ ఒక ప్రత్యేకమైన కుటుంబం రావడంతో వారికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తున్నారు. అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇటీవల ఆమె పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలపై సీనియర్ స్టార్ హీరో ఎవరూ ఊహించని విధంగా కామెంట్ చేసింది.

ఎంతో అన్యోన్యంగా

ఎంతో అన్యోన్యంగా

అల్లు అర్జున్ సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా ఫ్యామిలీకి ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ ఉంటాడు. దేశవ్యాప్తంగా అతనికి భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కూడా ఆ స్టార్ డమ్ ఎప్పటికీ కూడా కెమెరా వెనుక చూపించాడు. ఫ్యామిలీతో బన్నీ ఎంతో అన్యోన్యంగా ఉంటాడో అతని ఫోటోలు చూస్తుంటే అర్ధం అవుతుంది. ఇక అందుకు సంబంధించిన ఫోటోలను ఎక్కువగా బన్నీ సతీమణి స్నేహ రెడ్డి పోస్ట్ చేస్తూ ఉంటారు.

గ్లామర్ లుక్ లో బన్నీ వైఫ్

గ్లామర్ లుక్ లో బన్నీ వైఫ్

స్నేహ రెడ్డి కేవలం తన ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోలను మాత్రమే కాకుండా తన పర్సనల్ ఫోటోలు కూడా సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు. ఆమె ఎంత అందంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హీరోయిన్స్ కు ఏమాత్రం తీసిపోకుండా అప్పుడప్పుడు గ్లామర్ తో కూడా అభిమానులకు షాక్ ఇస్తూ ఉంటారు.

చీరలో గ్లామర్ లుక్

చీరలో గ్లామర్ లుక్

బన్నీ కూడా తన భార్య ఫోటోలు పై అప్పుడప్పుడు చాలా సరదాగా కామెంట్ కూడా చేస్తూ ఉంటాడు.. ఇటీవల స్నేహారెడ్డి చీరలో చాలా గ్లామర్ లుక్ తో కనిపించారు. ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఒక మోడల్ తరహాలో కనిపించడం విశేషం అనే చెప్పాలి. స్నేహ రెడ్డి కూడా అల్లు అర్జున్ తరహాలో ఫిట్నెస్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 ఫొటోలు వైరల్..

ఫొటోలు వైరల్..

ప్రస్తుతం అల్లు స్నేహ చీరలో ఉన్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అల్లు స్నేహారెడ్డి ఒక విధంగా అల్లు అర్జున్ కంటే ఎక్కువ ఫోటోలను అప్డేట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వారి కూతురు అల్లు అర్హ , అల్లు అయాన్ కు సంబంధించిన ఫోటోలను కూడా అభిమానులతో ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ ఉంటారు. అల్లు అర్జున్ తో ఇటీవల ప్రత్యేకంగా హాలిడేస్ కు వెళ్లిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

 హాట్ అంటూ సమంత కామెంట్..

హాట్ అంటూ సమంత కామెంట్..

ఇక స్నేహ రెడ్డి ఫోటోను పోస్ట్ చేయగానే సమంత ఎవరూ ఊహించని విధంగా ఒక కామెంట్ చేసింది. ఆమె హాట్ గా ఉన్నారు అంటూ ఒకే ఒక కామెంట్ తో నిప్పులాంటి ఏమోజీని కూడా జత చేసింది. మరికొంతమంది సెలబ్రిటీలు కూడా ఆమె ఫోటోలపై చాలా పాజిటివ్ కామెంట్ చేశారు. కానీ సమంత చేసిన కామెంట్ కు ఎక్కువ స్థాయిలో లైక్స్ వచ్చాయి.

పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్..

పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్..

ఇటీవల సమంత అల్లు అర్జున్ పుష్ప సినిమా లో స్పెషల్ సాంగ్ లో కనిపించిన విషయం తెలిసిందే. ఆ పాట సినిమాకు భారీ స్థాయిలో క్రేజ్ తీసుకు వచ్చింది. అంతే కాకుండా సమంత బన్నీ ఇద్దరు కూడా చాలా మంచి మిత్రులు కూడా. వీరి కలయికలో ఇదివరకే వచ్చిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక మళ్ళీ చాలాకాలం తర్వాత పుష్ప సినిమాలో ప్రత్యేకమైన సాంగ్ ద్వారా వారి స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X