Pushpa కోసం సమంత షాకింగ్ రెమ్యునరేషన్.. ఒక్క ఐటెమ్ సాంగ్ కోసం భారీ అమౌంట్!

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడవ చిత్రం పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియా మార్కెట్ కు ఏ మాత్రం తక్కువ కాకుండా మైత్రి మూవీ మేకర్స్ పుష్ప సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది.

ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు కూడా జనాల్లో పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసాయి. ఇక సినిమాకు సంబంధించిన ఐటెమ్ సాంగ్ కోసం కూడా దర్శకుడు సుకుమార్ ఇటీవల సమంతను సెలెక్ట్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆమెకు పారితోషికం ఎంత ఇస్తున్నారు అనే విషయం కూడా హాట్ టాపిక్ గా మారింది.

రంగస్థలం కంటే ముందే..

రంగస్థలం కంటే ముందే..

అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య, ఆర్య 2 సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. వీరి కలయిక లో రెండు సినిమాలు మాత్రమే వచ్చినప్పటికీ మంచి బాండింగ్ అయితే ఉంది. ఎప్పటినుంచో ఒక భారీ బడ్జెట్ సినిమా చేయాలని అనుకుంటున్నారు.

అసలైతే సుక్కు రంగస్థలం సినిమా కంటే ముందే అల్లు అర్జున్ తో ఒక సినిమా చేయాలని అనుకున్నారు. కానీ అప్పుడు వేరే కమిట్మెంట్ కారణంగా చేయలేకపోయాడు. అంతేకాకుండా రామ్ చరణ్ సుకుమార్ తో సినిమా చేయాలని ప్రత్యేకంగా కోరడంతో రంగస్థలం కథ సిద్ధమైంది.

సాంగ్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్

సాంగ్స్ తో పాజిటివ్ వైబ్రేషన్స్

ఇక మూడవ సారి అల్లు అర్జున్ సుకుమార్ పుష్ప సినిమాతో ఎలాగైనా బాక్సాఫీస్ రికార్డులను బ్లాస్ట్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రమోషన్ విషయంలో కూడా చాలా తెలివిగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే దేవి శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు కూడా జనాల్లోకి బాగానే ఎక్కేసాయి. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ ఈ సినిమాకోసం చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఈసారి సమంతతో ఐటెమ్ సాంగ్

ఈసారి సమంతతో ఐటెమ్ సాంగ్

ఇక సుకుమార్ ప్రతి సినిమాలో కూడా ఐటెం సాంగ్ ఎంత ప్రత్యేకంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కథను మలుపు తిప్పే ఎపిసోడ్స్ లో సుకుమార్ మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకునే విధంగా ఐటమ్స్ తో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఇక ఈసారి కూడా పుష్ప సినిమా కోసం అదే తరహాలో ఒక ప్లాన్ వేసినట్లు అర్థమవుతుంది. రంగస్థలం సినిమాలో పూజా హెగ్డేను ఐటెం సాంగ్ కోసం సెలెక్ట్ చేసుకున్న సుకుమార్ ఈ సారి పుష్ప సినిమా కోసం ఏకంగా సమంతను దింపుతున్నారు.

అందుకే గ్రీన్ సిగ్నల్

అందుకే గ్రీన్ సిగ్నల్

ప్రస్తుతం లేడీ ఓరియెంటెడ్ సినిమాల పై ఎక్కువగా ఫోకస్ చేస్తున్న సమంత స్పెషల్ గెస్ట్ రోల్స్ కూడా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.. అయితే సమంత ఇంత వరకు ఐటెమ్ సాంగ్స్ చేసింది లేదు. కానీ మొదటిసారి పుష్ప సినిమా కోసం స్పెషల్ సాంగ్ లో గ్లామరస్ లుక్ తో కనిపించడానికి సిద్ధమవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ప్రతి ఐటమ్ సాంగ్ కూడా ఒక ట్రెండ్ సెట్ చేసింది. దానికితోడు అల్లు అర్జున్ ఉంటే ఆ కాంబినేషన్ కు తిరుగు ఉండదు. అందుకే సమంత సింగిల్ సిట్టింగ్ లోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

Recommended Video

Ghani Teaser లో Ram Charan Mass | టాలీవుడ్ డిసెంబర్ రిలీజులు || Filmibeat Telugu
రెమ్యునరేషన్ ఎంతంటే?

రెమ్యునరేషన్ ఎంతంటే?

ఇక పుష్ప స్పెషల్ సాంగ్ కోసం సమంత పారితోషకం ఏ స్థాయిలో తీసుకుంటోంది అనే విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల కలలో సమంత లేడి ఓరియెంటెడ్ నాలుగు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు అయితే టాక్ అయితే వచ్చింది. ఇక ఇప్పుడు పుష్ప ఐటెమ్ సాంగ్ కోసం ఆమె కోటిన్నర వరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X