చండాలంగా ఉంది, ఆ ఫోటో తీసేయ్... సమంత పొట్టి డ్రెస్సుపై ట్రోలింగ్!
Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్త, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీ ద్వారా అభిమానులతో పంచుకుంటోంది.
తాజాగా రెడ్ కలర్ పొట్టి డ్రెస్సు ధరించిన సమంత హాట్ లుక్‌తో ఉన్న ఫోటోను షేర్ చేసింది. దానికి ఇన్నర్ పీస్ అనే క్యాప్షన్ పెట్టింది. అయితే ఈ ఫోటోపై అక్కినేని అభిమానులు మండి పడుతున్నారు. ఈ ఫోటో చాలా చండాలంగా ఉంది, ఇలాంటి ఫోటోల్లో నిన్ను చూడాలనుకోవడం లేదు, వెంటనే ఈ ఫోటో తీసేయ్ అంటూ కొందరు మండి పడుతున్నారు.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!

విమర్శలకు కారణమైన సమంత ఫోటో ఇదే
విమర్శలకు కారణమైన సమంత ఫోటో ఇదే. నీకు పెళ్లయింది... నీపై గౌరవం ఉంది... దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు అంటూ కొందరు ఫ్యాన్స్ సూచించారు. మరికొందరేమో డ్రెస్సు బాగానే ఉంది కానీ ఇది నీకు సూటవ్వలేదు అంటూ విమర్శించారు.

అభిమానులుగా నీకు చెప్పే బాధ్యత ఉంది
అభిమానులుగా ఏది కరెక్టో.. ఏది తప్పో చెప్పే బాధ్యత మాపై ఉంది. ఇలాంటి డ్రెస్సులు నువ్వు వేసుకోవడం మాకు నచ్చడం లేదు. దయచేసి మరోసారి ఇలాంటి ఫోటోలు పోస్టు చేయకండి మేడమ్ అంటూ కొందరు అభిమానులు సూచిస్తున్నారు.

మరికొందరి నుండి ప్రశంసలు
అయితే కొందరు అభిమానుల నుండి మాత్రం మీరు ఈ డ్రెస్సులో చాలా అందంగా ఉన్నారంటూ ప్రశంసలు వెల్లువెత్తాయి. అదే సమయంలో కొందరు ఫ్యాన్స్.... సమంతను డ్రెస్సు విషయంలో విమర్శిస్తున్న వారిపై గొడవకు దిగడం గమనార్హం.

సమంత సినిమాలు
సినిమాల విషయానికొస్తే... సమంత, నాగ చైతన్య కలిసి నటించబోయే సినిమా అక్టోబర్లో ప్రారంభం కాబోతోంది. ఇది స్ట్పోర్ట్స్ బేస్డ్ డ్రామా నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించబోతున్నారు. దీంతో పాటు నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ మూవీ రీమేక్‌లో సమంత నటించబోతున్నట్లు టాక్.


Click it and Unblock the Notifications











