మిడిల్ ఫింగర్ చూపిస్తూ.... తనను తిట్టిన అందరికీ షాకిచ్చిన సమంత!
Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం తన భర్త, టాలీవుడ్ స్టార్ నాగ చైతన్యతో కలిసి విదేశాల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి స్పెయిన్ దేశంలో పర్యటిస్తున్నారు. తమ పర్యటనకు సంబంధించిన ఫోటోలను సమంత ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇటీవల పొట్టి డ్రెస్సులో హాట్ హాట్‌గా ఉన్న ఫోటో ఒకటి పోస్టు చేశారు. దీంతో కొందరు అభిమానులకు కోపం వచ్చింది. పెళ్లి తర్వాత ఇలాంటి డ్రెస్సులు వేయండి ఏమిటి? నిన్ను ఇలా చూడలేక పోతున్నాం.... వెంటనే ఆ ఫోటోలు డిలీట్ చేయ్, ఇకపై ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేయవద్దు అంటూ విమర్శించారు.

మిడిల్ ఫింగర్ చూపిస్తూ సమంత ఘాటుగా
తను వేసుకున్న డ్రెస్సుపై మిమర్శలు చేస్తూ... పెళ్లి తర్వాత తాను ఎలా జీవించాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీతులు చెప్పిన వారికి సమంత గట్టి సమాధానం ఇచ్చింది. మిడిల్ ఫింగర్ చూపిస్తూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

విమర్శలకు కారణమైన ఫోటో ఇదే
విమర్శలకు కారణమైన సమంత ఫోటో ఇదే. దీనికి సమంత ఇన్నర్ పీస్ అనే క్యాప్షన్ తగిలిచింది. సామ్ ఈ ఫోటో పోస్టు చేసిన వెంటనే ఇన్‌స్టా పలువురు ఆమెను విమర్శిస్తూ కామెంట్స్ చేశారు. నీకు పెళ్లయింది... నీపై గౌరవం ఉంది... దయచేసి ఇలాంటి డ్రెస్సులు వేయవద్దు అంటూ సూచించారు.

గతంలోనూ ఇలానే
గతంలో కూడా సమంత బికినీ ఫోటో పోస్టు చేస్తే.... కొందరు విమర్శలకు దిగిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా సమంత తనదైన శైలిలో మండి పడ్డారు. మీ పని మీరు చూసుకోండి, నా జీవితం గురించి ఆలోచించడం మానేయండూ ఫైర్ అయ్యారు.

సమంత స్ట్రాంగ్ ఉమెన్
సమంత ఇలాంటి కామెంట్స్ అస్సలు పట్టించుకోదని, ఆమె చాలా స్ట్రాంగ్ ఉమెన్ అని..... తన కెరీర్లో ఆమె ఎన్నో విమర్శలను ధైర్యంగా తిప్పికొట్టిందని, కొందరు చేసే ఇలాంటి కామెంట్స్ ఆమెను ఏ మాత్రం కృంగదీయలేవు అని సమంత సన్నిహితులు అంటున్నారు. అయినా ఆమె కుటుంబ సభ్యులకు లేని అభ్యంతరం ఈ జనాలకు ఎందుకు అంటూ కొందరు ఫ్యాన్స్ సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు.


Click it and Unblock the Notifications











