Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
రవివర్మ గీసిన చిత్రాలు నేటి తారల్లా మారిపోయాయి.. ఫోటోలు వైరల్
అమ్మాయిలా అందాలను పొగడాలంటే.. మోనాలిసా పెయింటింగ్‌తో పోల్చడం, పికాసో చిత్రమా అంటూ పాటలు పాడటం, రవివర్మ గీసిన చిత్రమా అంటూ పాడుకోవడం అందరికీ తెలిసిందే. అయితే తెలుగు నాట బాపు బొమ్మలు ఎంత ప్రశస్తికి ఎక్కాయో తమిళనాట రాజా రవివర్మ గీసిన చిత్రాలు అంతటి ప్రాచుర్యం పొందాయి. తాజాగా నామ్ పేరిట సుహాసిని ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రముఖ ఫోటోగ్రాఫర్ వెంకట్రామ్ క్లిక్‌మనిపించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
|
దమయంతిగా రమ్యకృష్ణ..
రవివర్మ గీసిన దమయంతిలా మారిపోయిన రాణి.. వెంకట్రామ్ కెమెరాతో అద్భుతంగా మలిచాడు అంటూ దర్శకుడు కృష్ణవంశీ ఈ ఫోటోలను షేర్ చేశాడు. దమయంతిగా రమ్యకృష్ణ భలే సూట్ అయిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
— Samantha Akkineni (@Samanthaprabhu2) February 4, 2020 |
సామ్ లుక్కు నెటిజన్లు షాక్..
సుహాసిని ఏర్పాటు చేసిన ‘నామ్' ఈవెంట్లో సమంత అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఈ లుక్ కోసం సమంత బాగానే కష్టపడినట్టు తెలుస్తోంది. నిజంగానే రవివర్మ గీసిన చిత్రంలా సమంత ఉందని ఆమె అభిమానులు కామెంట్స్, లైకులు షేర్స్ చేస్తున్నారు.
శృతీహాసన్ లుక్స్..
సుహాసిని తల పెట్టిన ఈ కార్యక్రమంలో శృతీ హాసన్ సైతం పాల్గొంది. అచ్చం రవివర్మ కుంచెలోంచి జారి పడిన చిత్రంలా మారిపోయింది. ఇలాంటి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేసినందుకు సుహాసినికి థ్యాంక్స్ చెబుతూ.. ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
|
ఖుష్బూ సుందర్, ఐశ్వర్యా రాజేశ్ సైతం..
నామ్ వంటి ప్రత్యేకమైన ఫోటోషూట్ ఈవెంట్లో ఖుష్బూ, ఐశ్వర్యా రాజేశ్ కూడా పాల్గొన్నారు. వీరిద్దరు ఫోజులిచ్చిన తీరు చూస్తుంటే నిజంగా మళ్లీ రవివర్మ వచ్చి గీశాడా? అనేంత అందంగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫోటోలన్నీ తెగ చక్కర్లు కొడుతున్నాయి.