Samantha: హీరో అంటే మగాళ్లేనా? దిమ్మతిరిగేలా సమంత స్ట్రాంగ్ రిప్లయ్
మహిళా సాధికారత, సమానత్వం, మహిళా హక్కుల గురించి చిత్ర పరిశ్రమలో గళమెత్తే అతికొద్దిమందిలో అగ్రనటి సమంత కూడా ఒకరు. సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ సమకాలీన అంశాలపై ఆమె తన అభిప్రాయాలను వెల్లడిస్తూనే ఉంటారు. పురుషులకు మహిళలు ఏమాత్రం తక్కువ కాదని సమానమేనని సమంత వాదిస్తుంటారు. అలాగే చిత్ర పరిశ్రమలో మహిళలకు జరిగే అన్యాయాలు, వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ అంశాలపైనా పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు సామ్. తాజాగా హీరోయిజంపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..
లాంగ్ గ్యాప్ తర్వాత సమంత లీడ్‌లో నటిస్తోన్న మూవీ మా ఇంటి బంగారం. సమంత సన్నిహితురాలు బీవీ నందినీ రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. ట్రాలాలా మూవీంగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరులు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్షన్ దేవయ్య, దిగంత్ మంచాలే, గౌతమి, మంజుష, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా.. ఓమ్ ప్రకాష్ సినిమాటోగ్రాఫర్‌గా, ధర్మేంద్ర కాకర్ల ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. సమ్మర్ కానుకగా మే 15న మా ఇంటి బంగారం చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. దీనిలో భాగంగా సమంత- వెన్నెల కిషోర్‌లు స్పెషల్ చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మనతో పాటు ఉన్నారు.. తెలుగింటి బంగారం, సౌతిండియా సింగారం, ముద్ధ మందారం అంటూ సమంత గురించి చెబుతూ వెన్నెల కిషోర్ చిరాకు పడ్డారు. వెల్‌కమ్ సమంత అని వెన్నెల కిషోర్ పరిచయం చేసుకుంటూ ఉండగా .. నేను ఇక్కడే ఉన్నాను కదా అని సమంత ఆన్సర్ ఇచ్చింది. మిమ్మల్ని చూసి చాలారోజులు అయ్యింది కదా అందుకే అలా అన్నానని కిషోర్ తెలిపారు. ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మీద మూవీ తీస్తున్నారు కదా పర్మిషన్ తీసుకున్నారా అని కిషోర్ ప్రశ్నించారు. సమంతకు ఏం అర్ధం కాకపోవడంతో మా ఇంటి బంగారం అంటే మా.. మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషనే కదా అన్నారు కిషోర్. మా ఇంటి బంగారం అంటే మా.. మీ లెక్క అని సమంత క్లారిటీ ఇచ్చారు.
మా ఇంటి బంగారం అంటే.. మీ ఇంట్లో బంగారాన్ని కొందరొచ్చి దొంగిలించి బస్సులో వెళ్లిపోతుంటే చేజ్ చేసి కాపాడతారా అని కిశోర్ ప్రశ్నించారు. మీరు అలా అనుకున్నారా? అయితే అసలు కథ అది కాదు. ఇష్టమైన వాళ్లని మనం బంగారం అని పిలుచుకుంటాం, ఇది తెలుగులో కామన్ పదమే మీకు తెలియదా అని ఆన్సర్ ఇచ్చింది సమంత. రాజ్ గురించి చెప్పమని అడిగి.. అతని గురించి సమంత ఆన్సర్ ఇచ్చేలోగా నందినీ రెడ్డి గురించి చెప్పమనడంతో సమంత షాక్ షాక్ అయ్యింది.
ఈ మూవీలో హీరో ఎవరు అని వెన్నెల కిషోర్ అడగ్గా.. సమంత షాక్ అయ్యింది. ఈ హీరోలో నేను ఏంటీ అని మీరు అనుకుంటున్నారు? అని సమంత ఎదురు ప్రశ్నించింది. మీరు హీరోయిన్ అని కిషోర్ చెప్పారు. ఇంకా మీరు ఫిమేల్ లేడ్ ఫిలింస్‌ని ఎంకరేజ్ చేయకపోతే ఎలా అని సమంత మండిపడింది. ఒక మగవాడు లీడ్‌గా చేస్తే హీరో.. ఒక అమ్మాయి లీడ్‌గా చేస్తే హీరోయిన్ కదా అని కిశోర్ చెబుతాడు. దాంతో సమంత ఫోన్ అందుకుని హే సిరి హీరో అంటే డెఫినిషన్ చెప్పమని అడగ్గా.. ధైర్యం, గొప్ప ఆశయాలు ఉండి ఎదుటి మనిషికి స్పూర్తినిచ్చే ఎవరైనా హీరో అని.. ఇది జెండర్ న్యూట్రల్ టర్మ్ అని ఏఐ గొంతు ఆన్సర్ ఇస్తుంది. తద్వారా మా ఇంటి బంగారంలో తానే హీరో అని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది సమంత. అలాగే మగాళ్లు మాత్రమే హీరోలు కాదని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సమంత- వెన్నెల కిషోర్ మధ్య ఏం జరిగిందో తెలియాలంటే ... ఈ సంభాషణ తాలూకా ఫుల్ వీడియో రావాల్సిందే.


Click it and Unblock the Notifications