ఫ* యూ అంటూ సమంత రచ్చ.. మెసేజా? వార్నింగా? ఆ టీషర్ట్ ధర ఎంతో తెలుసా?
ఈ మధ్య కాలంలో స్టార్ హీరోయిన్ సమంత తరచూ వార్తల్లో నిలుస్తోంది. నాగచైతన్యతో విడాకులు ప్రకటన మొదలు ఆమె గురించి ప్రతి రోజూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంది. ఆమె ఏం చేసినా సంచలనమే, ఏం పోస్టు పెట్టినా వార్తే అన్నట్టు ఉంది పరిస్థితి. అయితే ఆమె అనూహ్యంగా తాను వేసుకున్న టీ షర్ట్ కారణంగా వార్తల్లోకి ఎక్కింది. ఆ వివరాల్లోకి వెళితే

ఆనందంగా గడుపుతూ
ఈ మధ్యనే అల్లు అర్జున్ హీరోగా వచ్చిన 'పుష్ప' సినిమాలో ఐటెం సాంగ్ చేసి హాట్ టాపిక్ అయింది సమంత. ఊ అంటావా మావా ఊహూ అంటావా మావా అంటూ సాగిన ఆ పాటకు మంచి స్పందన లభించింది. ఎందుకో తెలియదు కానీ ఆమె విడాకుల తరువాత ట్రిప్ లకు వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే పుణ్యక్షేత్రాలు మొదలు వెకేషన్ స్పాట్స్ దాకా దేన్నీ వదలకుండా అక్కడికి వెళ్లి ఆనందంగా గడుపుతోంది.

కెమెరాకు చిక్కి
ఇటీవలే స్విట్జర్లాండ్‌లో మంచుకొండల్లో ఆనందంగా గడిపి వచ్చిన ఆమె ముంబైలోని బాంద్రా ఏరియాలో ఫోటో గ్రాఫర్ల కెమెరాకు చిక్కింది. సెలూన్ షాప్ నుండి బయటకు వస్తూ.. కెమెరాలకు చిక్కడంతో వారంతా వెంటనే క్లిక్ మనిపించారు. అయితే ఈ ఫోటోలు చూసిన అందరూ సమంత ధరించిన టీ షర్ట్ గురించే మాట్లాడుకుంటున్నారు. దానికి కారణం ఆమె వేసుకున్న టీ షర్ట్ మీద ఉన్న మ్యాటరే.
సోషల్ మీడియాలో వైరల్
ఆమె వేసుకున్న టీ షర్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆమె వేసుకున్న టీ షర్ట్ పై 'F**k you f**king f**k' అని రాసి ఉంది. ఆ లైన్స్ చూస్తుంటే సమంత ఎవరికో కావాలనే మెసేజో, వార్నింగో ఇచ్చినట్లే అనిపిస్తుంది. అయితే సమంత లాంటి హీరోయిన్ ఇలా అసభ్య పదజాలం ఉన్న టీషర్ట్ ను ధైర్యంగా బయటకు వేసుకురావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అన్నట్టు ఈ టీ షర్ట్ ధర అక్షరాలా 17, 000 అంటున్నారు.

సినిమాల విషయానికొస్తే
ఇక సమంత నటిస్తున్న సినిమాల విషయానికొస్తే.. గతేడాది 'శాకుంతలం' సినిమా షూటింగ్ ను పూర్తి చేసిన సమంత ప్రస్తుతం 'యశోద' అనే సినిమాలో నటిస్తోంది. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఆమె నర్స్ పాత్రలో కనిపించనుంది అంటూ ప్రచారం జరుగుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాగా ప్రచారం అవుతున్న ఈ సినిమాలో సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనుంది.

బిజీ బిజీగా
ఇక ఈ సినిమాలు కాకుండా ఇంటర్నేషనల్ సినిమా 'అరేంజ్‌మెంట్స్ ఆఫ్ లవ్'లో కీలక పాత్ర పోషిస్తోంది. అంతే కాకా తెలుగు, తమిళ భాషలలో పాటు ఓ బై లింగ్యువల్ సినిమా కూడా చేస్తోంది. ఇవి కాకుండా ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకేలు తెరకెక్కిస్తున్న మరో అంతర్జాతీయ వెబ్ సిరీస్ లో కూడా ఆమె భాగం అవనుందని చెబుతున్నారు. సినిమాల మీద ఆమె ఎక్కువ ఫోకస్ పెడుతున్న క్రమంలో బిజీ బిజీగా గడుపుతోంది.


Click it and Unblock the Notifications











