Samantha నాకు కొందరితో అఫైర్లు.. పిల్లలు వద్దని అబార్షన్లు.. రూమర్లపై భగ్గుమన్న సమంత

సమంత విడాకుల విషయంలో జరుగుతున్న ప్రచారం మీద ఎట్టకేలకు ఆమె స్పందించింది. కొద్ది రోజుల క్రితం అధికారికంగా నాగచైతన్య సమంత విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన వచ్చినప్పటి నుంచి కొంతమంది సమంతను టార్గెట్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉండగా కొంత మంది ఆమెను వెనకేసుకొస్తున్నారు. ఈ నెగిటివ్ కామెంట్స్ అలాగే ట్రోలింగ్ విషయంలో ఇప్పటి వరకు నోరు విప్పని సమంత తాజాగా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక్కసారిగా బరస్ట్ అయ్యారు. ఈ వ్యవహారం మీద సమంత ఏమని కామెంట్ చేశారు అనే వివరాల్లోకి వెళితే

అలా ప్రేమలో పడి

అలా ప్రేమలో పడి

ఏం మాయ చేసావే సినిమా షూట్ సమయంలో కలుసుకున్న అక్కినేని నాగచైతన్య సమంత చాలా కాలం తర్వాత ప్రేమలో పడ్డారు. ఇద్దరి కులాలు మతాలు వేరైనా సరే అందరినీ ఒప్పించి వారు ప్రేమ వివాహం చేసుకున్నారు. వారి వివాహం జరిగినప్పటి నుంచి కూడా టాలీవుడ్ లో మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు. అయితే వారు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ప్రచారం మొదలు కాగా చాలా కాలం పాటు ఎవరు ఈ విషయం మీద స్పందించలేదు.

నాలుగు రోజులు ఉందనగా

నాలుగు రోజులు ఉందనగా

వీరి వివాహ వార్షికోత్సవానికి సరిగ్గా నాలుగు రోజులు ఉంది అనగా తమ మధ్య వచ్చిన విభేదాల కారణంగా భార్య భర్తల బంధాన్ని కొనసాగించే లేక పోతున్నాను అని సమంత అలాగే నాగచైతన్య ఇద్దరూ కూడా అధికారికంగా ప్రకటించారు.. అదే సమయంలో అక్కినేని నాగార్జున కూడా స్పందిస్తూ ఇది చాలా పర్సనల్ విషయం అని వారిద్దరూ అంటే నాకు ఇష్టమే అని చెప్పుకొచ్చారు ఈ విషయం ఇంతటితో వదిలేద్దాం అని కూడా ఆయన కామెంట్ చేశారు.

రకరకాల ప్రచారాలు

రకరకాల ప్రచారాలు

అయితే సమంతకు అఫైర్స్ ఉన్నాయని వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకోవడం వల్లనే ఈ వ్యవహారం విడాకుల వరకు వచ్చిందని అలాగే సంతానం కావాలని నాగచైతన్య కోరుకుంటూ ఉంటే సమంత అందుకు ఒప్పుకోలేదు అని ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూ వస్తున్నాయి. ఈ విషయం మీరు ఇప్పటి దాకా సమంత సన్నిహితులు అలాగే ఆమె స్నేహితులు మాత్రమే స్పందిస్తూ వచ్చారు, అది కూడా పరోక్షంగా. ఎట్టకేలకు ఈ విషయం మీద సమంత నోరు తెరిచి మాట్లాడింది.

ఎమోషనల్ నోట్

తాజాగా ఆమె తన ఫాన్స్ ను ఉద్దేశిస్తూ ఒక ఎమోషనల్ నోట్ రాసింది. తన విషయంలో సానుభూతి చూపిస్తున్నందుకు అలాగే తన విషయం గురించి పట్టించుకుంటున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలిపింది. అలాగే తన మీద వస్తున్న తప్పుడు కథనాలను ఖండిస్తూ తనకు అండగా నిలబడుతున్నందుకు కూడా ఆమె ఈ నోట్ లో ధన్యవాదాలు తెలిపారు.

 అఫైర్స్ ఉన్నాయి, అవకాశవాదిని

అఫైర్స్ ఉన్నాయి, అవకాశవాదిని


వాళ్లు నాకు అఫైర్స్ ఉన్నాయని, అసలు పిల్లలే వద్దు అని అనుకున్నానని, అలాగే నేను ఒక అవకాశవాదిని అంటూ ప్రచారం చేస్తున్నారని సమంత పేర్కొంది. అంతేకాక నాకు అబార్షన్స్ అయ్యాయి అని కూడా ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పుకొచ్చింది. విడాకులు అనేవే చాలా బాధ కరమైన ప్రక్రియ అని, ఈ విషయం నుంచి కోలుకోవడానికి నాకు నేనే ఒంటరిగా సమయం ఇచ్చి గడువుతున్నానని ఆమె చెప్పుకొచ్చారు. మీరు కూడా నాకు నయం కావడానికి సమయం ఇవ్వనివ్వండని పేర్కొన్నారు.

Recommended Video

నాకు అఫైర్స్, అబార్షన్స్ అని మాట్లాడుతున్నారు, సమంత ఎమోషనల్ నోట్..! || Filmibeat Telugu
మాట ఇస్తున్నా

మాట ఇస్తున్నా


తన మీద జరుగుతున్న ఈ వ్యక్తిగత దాడి చాలా దారుణమని, కనికరంలేనిదని అన్నారు. అయినా సరే వాళ్ళు చెబుతున్న ఏ విషయాలు తనను క్రుంగ తీయవు అని, వారు చెప్పేది నన్ను విచ్ఛిన్నం చేయడానికి నేను అనుమతించను అని మాట ఇస్తున్నానని ఆమె పేర్కొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X