హాట్ పిక్: పొట్టి గౌనులో సమంత, ఫ్యాన్స్ ఫన్నీ కామెంట్స్!
టాలీవుడ్లో ఫ్యాషన్ ట్రెండ్స్ బాగా ఫాలో అయ్యేవారిలో హీరోయిన్ సమంత ఒకరు. ప్రత్యేకంగా స్టైలిస్టులను, డిజైనర్లను హైర్ చేసుకోవడం లాంటి సంస్కృతి తెలుగులో మొదలు పెట్టింది కూడా ఆవిడే అని చెబుతుంటారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సామ్ తన హాట్ ఫోటోలతో అభిమానులకు కనువిందు చేస్తుంటారు.
తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన పిక్ హాట్ టాపిక్ అయింది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన పొట్టి గౌను ధరించిన సమంత డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అయితే ఈ ఫోటోపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు బ్యూటిఫుల్ అంటూ కామెంట్స్ చేస్తుంటే... మరికొందరేమో ఈ డ్రెస్సులో స్కెల్టన్‌లా కనిపిస్తున్నావని, చెత్తలుక్ అంటూ విమర్శలు చేశారు.

సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం 'ఓ బేబీ' అనే చిత్రంలో నటిస్తోంది. నందినీ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సమంత డెబ్బై ఏళ్ల ముసలమ్మ పాత్రలో... 20 యువతి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కొరియన్ మూవీ 'మిస్ గ్రానీ'కి ఇది రీమేక్
పెళ్లి తర్వాత సామ్ తన భర్త నాగ చైతన్యతో కలిసి నటించిన తొలి చిత్రం 'మజిలీ'. ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద సంచలన విజయం అందుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సమంత మాట్లాడుతూ..'మజిలీ' విడుదల రోజు తెల్లవారు ఝామున 2.30 గంటలకే నిద్ర లేచాను. పాజిటివ్ రెస్పాన్స్ రావాలని పూజలు చేయడం మొదలు పెట్టాను. ఉదయం ఫస్ట్ రిపోర్ట్ సినిమా బావుంది, హిట్ అవుతుందని రాగానే... భావోద్వేగానికి గురయ్యాను, అరగంట సేపు ఏడుస్తూనే ఉన్నాట్లు తెలిపారు.


Click it and Unblock the Notifications











