సమంత కూడా మద్దతు... లైంగిక వేధింపులకు సాక్ష్యాలా? సారీ...
Recommended Video

బాలీవుడ్ నటి తనుశ్రీ దత్తా #మీటూ ఉద్యమంలో భాగంగా నానా పాటేకర్ మీద లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. పదేళ్ల క్రితం జరిగిన సంఘటనను ఆమె తిరగతోడటంతో సంచలనం అయింది. ఆ తర్వాత జరిగిన వివాదాలతో #మీటూ ఉద్యమం మరింత ఉధృతం అయింది. పలువురు బాలీవుడ్ నటీమణులతో పాటు సౌత్ స్టార్స్ కూడా తమకు ఎదురైన అనుభవాల గురించి బయట పెడుతున్నారు. తాజాగా దక్షినాది సింగర్ చిన్మయి తకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో మీటూ ఉద్యమానికి తన మద్దతు ప్రకటిస్తూ సమంత అక్కినేని ముందుకొచ్చారు.

ధైర్యంగా ముందుకొస్తున్నందుకు సంతోషం: సమంత
#మీటూ ఉద్యమంలో చాలా మంది మహిళలు భాగం అవుతూ వారికి ఎదురైన సంఘటనల గురించి ధైర్యంగా వెల్లడిస్తుండటం సంతోషంగా ఉంది. వారిని ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే. వారికి నా మద్దతు కూడా ఉంటుంది... అని సమంత ట్వీట్ చేశారు.
లైంగిక వేధింపులకు సాక్ష్యాలా? సారీ...
అయితే కొందరు వ్యక్తులు, అందులోనూ కొందరు మహిళలు సైతం.... #మీటూ ఉద్యమంలో భాగమైన వారికి వ్యతిరేకంగా మాట్లాడటం, మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? అంటూ ప్రశ్నింస్తుండటం బాధగా ఉంది. ఇలాంటి పరిస్థితులు ఎదుక్కొంటున్న వారికి సారీ... అని సమంత వ్యాఖ్యానించారు.
చిన్న పిల్లలను కాపాడిన వారు అవుతున్నారు
మీటూ ఉద్యమంలో మీరు గొంతు వినిపించడం ద్వారా... ఎంతో మంది చిన్న పిల్లలు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనల బారిన పడకుండా కాపాడిన వారు అవుతున్నారు. అందుకే మీటూ ఉద్యమానికి నేను మద్దతు ఇస్తున్నాను అని సమంత తెలిపారు.
చిన్మయి వ్యాఖ్యలపై సమంత
సమంత ఫ్రెండ్, సింగర్ చిన్మయి తాను 8 ఏళ్ల వయసులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపారు. ఇలాంటివి జరిగిన తర్వాత స్ట్రాంగ్‌గా తన అభిప్రాయాలు చెప్పడంపై సమంత అభినందించారు.


Click it and Unblock the Notifications











