నైట్ పార్టీలో మునిగితే అంతే.... సమంత, తమన్నా, అదితితో అమల (ఫోటోస్)
సోమవారం రాత్రి మంచి పార్టీ ఎంజాయ్ చేస్తే ... మంగళవారం చాలా బ్రైట్‌గా కనిపిస్తుంది.... ఈ కామెంట్ చేసింది మరెవరో కాదు హీరోయిన్ అదితి రావు హైదరి. ఈ కామెంటుతో పాటు కొన్ని ఫోటోలు కూడా ఆమె అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోల్లో అదితితో పాటు హీరోయిన్ తమన్నా, సమంత, అమల అక్కినేని, పింకీరెడ్డి తదితరులు ఉన్నారు. ఈ పార్టీ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

పార్టీ ఏర్పాటు చేసిన పింకీ రెడ్డి
సుబ్బిరామిరెడ్డి కూతురు పింకీ రెడ్డి ఈ పార్టీ ఏర్పాటు చేశారు. సంజయ్ గార్గ్ ఫ్యాషన్ లేబుల్ ‘రా మ్యాంగోస్' 10 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సెలబ్రేషన్స్ నిర్వహించారు.

థాంక్స్ చెప్పిన తమన్నా
హీరోయిన్ తమన్నా సైతం కొన్ని ఫోటోలు తన సోషల్ మీడియా పేజీ ద్వారా షేర్ చేస్తూ... ‘ఈ విందు ఏర్పాటు చేసిన పింకీ రెడ్డికి థాంక్స్ చెప్పారు. ‘రా మ్యాంగో' పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వారిని విష్ చేశారు.

లాంగ్ గ్యాప్ తర్వాత
లాంగ్ గ్యాప్ తర్వాత అమల మేడం, సమంత, అదితిలను కలవడం సంతోషంగా ఉందంటూ తమన్నా వ్యాఖ్యానించారు.

తమన్నా హాట్ లుక్ హైలెట్
అదితిరావు, తమన్నా కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు. తన రెడ్ డ్రెస్సులో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో తమన్నా ఈ పార్టీలో మరింత హైలెట్ అయ్యారు.

బ్యూటిఫుల్ డిన్నర్
పింకీ రెడ్డి ఏర్పాటు చేసిన బ్యూటిఫుల్ డిన్నర్ ఆస్వాదిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సమంత, అదితి రావు హైదరి, తమన్నా.


Click it and Unblock the Notifications











