ఊహకే అందని పాత్రలో సమంత: తెలుగు హిట్ మూవీ కోసం రిస్క్.. అంత ఘోరంగా కనిపిస్తే తట్టుకుంటారా!

'ఏమాయ చేశావే' సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది సమంత. మొదటి సినిమాలోనే ఆకట్టుకోవడంతో ఆమెకు ఆఫర్లు వెల్లువెత్తాయి. దీంతో తెలుగులోని దాదాపు అందరు స్టార్ హీరోలతో నటించింది. తద్వారా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది. ఇటీవలి కాలంలో స్పీడు తగ్గించిన ఆమె.. వైవిధ్యమైన చిత్రాల్లోనే నటిస్తోంది. ఇందులో భాగంగానే తెలుగులో హిట్ అయిన ఓ మూవీ సీక్వెల్‌లో నటించబోతోంది. ఇందులో సమంత ఊహకే అందని పాత్రలో నటిస్తుందని తెలిసింది. అసలేంటా సినిమా? పూర్తి వివరాలు మీకోసం!

బ్రా వేసుకోకుండా గ్లామర్ షో... ఎద అందాలను బయటపెట్టిన యువ తార..

రెండు చోట్లా బిజీ.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా

రెండు చోట్లా బిజీ.. సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా

తెలుగులో మాత్రమే కాకుండా దక్షిణాదిలోని మిగిలిన భాషల్లోనూ సినిమాలు చేస్తూ వస్తోంది సమంత. మరీ ముఖ్యంగా తమిళంలోనూ ఆమె ఘనమైన రికార్డును క్రియేట్ చేసుకుంది. ఇలా ఏక కాలంలో టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ సక్సెస్‌కు కేరాఫ్ అడ్రెస్‌గా నిలుస్తోంది. లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లోనూ సత్తా చాటుతూ స్టార్ హీరోయిన్ హోదాను నిలబెట్టుకుంటోందీ భామ.

వరుస విజయాలు.. అలా బ్రేక్ పడిపోయింది

వరుస విజయాలు.. అలా బ్రేక్ పడిపోయింది

తెలుగులో కొంత కాలంగా వరుస విజయాలను అందుకుంటూ హవాను చూపిస్తోన్న సమంత.. 'అఆ' నుంచి ఎన్నో హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అయితే, గత ఏడాది 'జాను' అనే సినిమా రూపంలో ఓ భారీ ఫ్లాప్ ఎదురైంది. తమిళంలో హిట్ చిత్రం '96'కు రీమేక్‌గా వచ్చిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముందు బోల్తా పడింది. ఫలితంగా సామ్ విజయాల పరంపరకు బ్రేక్ పడిపోయింది.

శకుంతలగా మారిన సామ్.. పాన్ ఇండియా

శకుంతలగా మారిన సామ్.. పాన్ ఇండియా

'జాను' తర్వాత సమంత సినిమాకు గుడ్‌బై చెబుతుందన్న టాక్ వినిపించింది. అందుకు అనుగుణంగానే ఆమె చాలా కాలం పాటు మరో సినిమాను ప్రకటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గుణశేఖర్‌ దర్శకత్వంలో 'శాకుంతలం' అనే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటిస్తున్నట్లు ప్రకటించింది. ప్రీ-ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్న ఈ రొమాంటిక్ డ్రామాను గుణ టీమ్ వర్స్క్ బ్యానర్‌పై నీలిమ నిర్మిస్తున్నారు.

న్యూ వరల్డ్‌లోకి సమంత.. అన్నీ సాహసాలే

న్యూ వరల్డ్‌లోకి సమంత.. అన్నీ సాహసాలే

ఇప్పటి వరకు హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించిన సమంత.. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' అనే వెబ్ సిరీస్‌తో ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. మనోజ్ భాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సిరీస్‌ను.. తెలుగు దర్శకులు రాజ్‌ నిడిమోరు, కృష్ణ డీకే ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. ఇందులో ఆమె టెర్రరిస్టు పాత్రలో నటిస్తోంది. దీని కోసం సామ్ ఎన్నో సాహసాలు చేసింది.

వినూత్న దర్శకుడికి సమంత గ్రీన్ సిగ్నల్

వినూత్న దర్శకుడికి సమంత గ్రీన్ సిగ్నల్

'అ!', 'కల్కి' వంటి ప్రయోగాత్మక చిత్రాలతో వైవిధ్యాన్ని చూపించాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఈ క్రమంలోనే అతడు 'జాంబీ రెడ్డి' అనే సినిమా తీశాడు. తెలుగులోనే మొట్టమొదటి జాంబీ ఫిల్మ్‌గా రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో దీనికి సీక్వెల్‌గా 'రివేంజ్ ఆఫ్ డెత్' అనే మూవీ చేస్తున్నాడతను. ఇందులో సమంత నటించబోతుందని తెలుస్తోంది.

అంత ఘోరంగా కనిపిస్తే తట్టుకుంటారా!

అంత ఘోరంగా కనిపిస్తే తట్టుకుంటారా!

'జాంబీ రెడ్డి' భారీ విజయాన్ని అందుకోవడంతో దానికి కొనసాగింపుగా తీసే 'రివేంజ్ ఆఫ్ డెత్'పై భారీ అంచనాలు ఉంటాయి. అందుకు అనుగుణంగానే కథను సిద్ధం చేశాడట ప్రశాంత్. అందుకే ఈ చిత్రంలో నటించేందుకు సామ్ ఓకే చెప్పిందని టాక్. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాలో ఆమె జాంబీగా కనిపించనుందట. మరి ఆమెను అలా చూసి ప్రేక్షకులు తట్టుకోగలరో లేదో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X