Samantha: ట్రైలర్‌తో టాప్ లేపిన సమంత... 43 మంది స్టార్స్‌ని దాటేసి నెంబర్‌వన్‌గా!
ఇండస్ట్రీకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు వెళ్తుంటారు. కానీ కొందరు మాత్రమే తమ పాత్రలతో, ప్రతిభతో అద్భుతాలు సృష్టించారు. ఈ కోవలోకే వస్తారు టాలీవుడ్ అగ్రనటి సమంత. ఆమె గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని వ్యక్తిగత కారణాలతో ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించినప్పటికీ సమంత క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని కొన్ని అంశాలు నిరూపిస్తున్నాయి. స్టార్ రేటింగ్‌లో హీరోయిన్లను దాటుకుంటూ వెళ్తున్న సామ్.. తాజాగా మరో ఘనత సాధించారు. ఏకంగా హీరోలనే క్రాస్ చేసేశారు. ఈ వివరాల్లోకి వెళితే..
గౌతమ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కిన ఏం మాయ చేశావే (2010)తో వెండితెరపై అడుగుపెట్టారు చెన్నై చంద్రం సమంత. అయితే ఈ సినిమా కంటే ముందు తమిళంలో నటించిన విన్నైతాండి వరువాయ సినిమా రిలీజైంది. ఏం మాయ చేశావే చిత్రంలో సమంత అందాలు, నాగచైతన్యతో కెమెస్ట్రీకి కుర్రకారు ఫిదా అయిపోయారు. దాంతో ఈ లవ్ రొమాంటిక్ మూవీ ఘన విజయం సాధించింది. ఈ దెబ్బకు తెలుగులో సమంతకు ఆఫర్లు క్యూకట్టాయి.

బృందావనం, దూకుడు, ఈగ, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు, అత్తారింటికి దారేది, మనం, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్, రాజుగారి గది 2, రంగస్థలం, మహానటి, ఓ బేబీ తదితర చిత్రాలతో సమంతకు వెనుదిరిగి చూసుకునే అవకాశం రాలేదు. తెలుగుతో పాటు తమిళం, హిందీలలోనూ సమంత నటించారు. ఇక వెబ్ సిరీస్‌లతో సమంత దుమ్మురేపారు. ది ఫ్యామిలీ మెన్, సిటాడెల్ : హనీ బన్నీ చిత్రాలు ఆమెకు ఓటీటీల్లోనూ తిరుగులేని మార్కెట్ తీసుకొచ్చింది. పుష్ప ది రైజ్‌లో స్పెషల్ సాంగ్‌తో దేశం మొత్తాన్ని ఊపేశారు.
అయితే ఇటివలీ కాలంలో సమంత చేసిన సినిమాలు వర్కవుట్ కావడం లేదు. యశోద, శాకుంతలం, ఖుషి సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. దాంతో నిర్మాతగా మారిన సమంత.. ట్రాలాలా మూవీ పిక్చర్స్ బ్యానర్‌ను స్థాపించి శుభం సినిమాను నిర్మించి మంచి విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం సమంత స్వీయ నిర్మాణంలో నటించిన సినిమా మా ఇంటి బంగారం. మే 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు వేగవంతం చేశారు సమంత. ఈ సినిమాపైనే సమంత ఆశలు పెట్టుకున్నారు. రాజ్ నిడిమోరుతో రెండో పెళ్లి తర్వాత సమంత నటిస్తోన్న తొలి మూవీ కావడంతో మా ఇంటి బంగారం సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
కొద్దిరోజుల క్రితం విడుదల చేసిన మా ఇంటి బంగారం సినిమా ట్రైలర్ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంది. అమాయకంగా ఉమ్మడి కుటుంబంలోకి అడుగుపెట్టిన కోడలిగా కనిపించే అమ్మాయి.. బస్సులో కత్తి, గన్ పట్టుకుని శత్రువుల అంతు చూసే అమ్మాయిగా పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు సమంత. అలాగే ఈ సినిమాలోని పాటకు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్‌తో సంచలనాలు సృష్టిస్తోన్న సమంత మరో ఘనతను అందుకుంది. ప్రముఖ మూవీ డేటా బేస్ పోర్టల్.. ఐఎండీబీలో పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. వారం క్రితం ఇదే సమయానికి 43వ స్థానంలో ఉన్న సామ్.. మా ఇంటి బంగారం ట్రైలర్ కారణంగా 43 మంది స్టార్స్‌ని దాటేసి టాప్ ప్లేస్‌లో నిలిచినట్లు ఐఎండీబీ తెలిపింది. దాంతో సమంత అభిమానులు ఈ న్యూస్‌ను ట్రెండింగ్‌లోకి తీసుకొస్తూ సమంతకు విషెస్ తెలియజేస్తున్నారు.


Click it and Unblock the Notifications


