twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సేవ అంటే జాలి కాదు: ఎయిడ్స్ చిన్నారులను షాపింగుకు తీసుకెళ్లిన సమంత (ఫోటోస్)

    |

    సేవ చేయడం అంటే జాలి చూపించడం కాదు... వారిపై ప్రేమ చూపించడం అంటోంది టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత. క్రిస్మస్ సందర్భంగా శాంటా అవతారం ఎత్తిన సామ్... డిజైర్ సొసైటీకి చెందిన పిల్లలను షాపింగ్ మాల్‌కు తీసుకెళ్లింది. అక్కడ వారికి ఇష్టమైన దుస్తులు కొనిపెట్టింది.

    పిల్లలంతా షాపింగ్ మాల్లో తిరుగుతూ తమకు ఇష్టమైన దుస్తులు వారే సెలక్ట్ చేసుకున్నపుడు వారి కళ్లలో కనిపించిన ఆనందం చూసి సమంత మురిసిపోయింది. వారితో గడిపిన బ్యూటిఫుల్ మూమెంట్స్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

     సేవ చేయడం అంటే జాలి చూపించడం కాదు

    సేవ చేయడం అంటే జాలి చూపించడం కాదు

    సేవ చేయడం అంటే జాలి చూపించడం కాదు.. ప్రేమ చూపించడం. ఇక్కడ నేను చాలా ప్రేమ చూశాను అంటూ డిజైర్ సొసైటీకి చెందిన చిన్నారులు, నిర్వాహకులతో కలిసి దిగిన ఫోటోను సమంత షేర్ చేశారు. హెచ్ఐవి/ఎయిడ్స్‌ బారిన పడ్డన చిన్నారుల కోసం డిజైర్ సొసైటీ నడుపుతున్నారు.

    నాలో ఎంతో స్పూర్తి నింపారు

    నాలో ఎంతో స్పూర్తి నింపారు

    డిజైర్ సొసైటీ పిల్లలు, నిర్వాహకులు.. ఒకే ఒక్క రోజులో నాలో ఎంతో స్పూర్తి నింపారు. మిమ్మల్ని ఆ దేవుడు చల్లగా చూడాలి, మీలో మరింత ఆత్మస్తైర్యం నింపాలి అని సమంత ఆకాంక్షించారు.

    బాలుడి కళ్లలో ఆనందం చూసి మురిసిన సమంత

    బాలుడి కళ్లలో ఆనందం చూసి మురిసిన సమంత

    మనం దుస్తులు కొని తీసుకెళ్లి ఇస్తే వారికి నచ్చుతాయో లేదో? అని ఆలోచించిన సమంత... అందరినీ స్వయంగా షాపింగుకు తీసుకొచ్చి వారికి నచ్చినవి ఎంచుకునే ఫ్రీడమ్ ఇవ్వడంతో వారి మొహాలు ఆనందంతో వెలిగిపోయాయి. వారి హ్యాపీనెస్ చూసిన తర్వాత సమంతకు కావాల్సినం సంతృప్తి లభించింది.

    సమంతపై ప్రశంసలు

    సమంతపై ప్రశంసలు

    చాలా మంది సేవ చేయడం అంటే జాలి చూపించడంగానే భావిస్తారు. అయితే వారి నుంచి ప్రేమ పొందే ప్రయత్నం కొద్ది మంది మాత్రమే చేస్తారు. సమంత చేసిన ఈ పనిపై నెటిజన్ల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

     వారితో ఆడి పాడిన సమంత

    వారితో ఆడి పాడిన సమంత

    డిజైర్ సొసైటీ పిల్లలకు ఇష్టమైన పండగ దుస్తులు కొనిపెట్టడం మాత్రమే కాదు... వారితో సంతోషంగా గడిపించింది. వారికి సేవ చేయడం వల్ల సమంత ఎంత ఆనందం పొందారో ఈ ఫోటోల్లో ఆమె ముఖంలో కనిపిస్తున్న హావభావాలే నిదర్శనం.

    దాన్ని నిజం చేసిన సామ్

    దాన్ని నిజం చేసిన సామ్

    క్రిస్మస్ రోజున సీక్రెట్ శాంటా వచ్చి చిన్నారులకు బహుమతులు ఇస్తాడు అని చెబుతుంటారు. దీన్ని నిజం చేస్తూ డిజైన్ సొసైటీ చిన్నారులను సర్ ప్రైజ్ చేయడం విశేషం.

    ప్రత్యూష ఫౌండేషన్‌కు స్పెషల్ డే

    ప్రత్యూష ఫౌండేషన్‌కు స్పెషల్ డే

    ప్రత్యూష ఫౌండేషన్ తరుపున సమంత ఈ చారిటీ కార్యక్రమం చేసింది. తాము నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్‌కు ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని సమంత చెప్పుకొచ్చారు.

    సమంత సినిమాలు

    సమంత సినిమాలు

    సమంత ప్రస్తుతం తన భర్త నాగ చైతన్యతో కలిసి ‘మజిలి' చిత్రంలో నటిస్తోంది. దీని తర్వాత నందినీ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయబతోంది. మరో వైపు తమిళంలో ఆమె నటించిన ‘సూపర్ డిలక్స్' 2019లో విడుదలకు సిద్ధమవుతోంది.

    English summary
    "Charity isn’t about pity ,it is about love . And I saw a lot of love today . Desire is a society for children affected by HIV/AIDS . The children here and the people who run this establishment have inspired me more in one day than I have been this entire year .. God bless your wonderful and strong souls." Samantha said.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X