సమంతకు తెగనచ్చేసింది... చైతూకు సపోర్టు చేస్తూ ట్వీట్!

By Bojja Kumar

నాగచైతన్య, అను ఇమ్మాన్యుయేల్ హీరో హీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'శైలజారెడ్డి అల్లుడు'. ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట 'అను బేబీ' వీడియో ప్రమోను విడుదల చేశారు.

'అను బేబీ..సరే ఆగవే..అలకొచ్చిన అణుబాంబులా అలా చూడకే..' అనే లిరిక్స్‌తో సాగే ఈ పాటకు గోపీ సుందర్ అందించిన సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ పాటపై సినీ నటి, నాగ చైతన్య వైఫ్ సమంత ట్విట్టర్ ద్వారా స్పందించారు. తనకు ఈ సాంగ్ ఎంతో నచ్చింది అంటూ ట్వీట్ చేశారు.

Samantha tweet about Anu Baby Song from Shailaja Reddy Alludu

ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత... ఈ మధ్య చైతూకు సంబంధించిన సినిమాలను ప్రమోట్ చేస్తూ తనవంతు సహకారం అందిస్తున్నారు. దర్శకుడు మారుతి సైతం సమంతకు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.

ఈ మూవీలో టైటిల్ పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. ఇందులో ఆమె పవర్‌ఫుల్ అత్తపాత్రలో కనిపించబోతున్నారు. అత్త, అల్లుడికి జరిగే కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. నాగార్జున మూవీ 'అల్లరి అల్లుడు' తరహాలో ఈ సినిమా ఉండబోతోందని టాక్.. అంతే కాదు. అల్లరి అల్లుడు లోని 'నిన్ను రోడ్డు మీద చూసినది లగాయిత్తు' పాటను ఈ సినిమా కోసం రీమేక్‌ చేశారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్లో నాగ వంశీ, పీడీవీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెంచింది. ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X