నీలో స్వార్థం లేదు, గర్వంగా ఉంది: పవన్ కళ్యాణ్ మీద సమంత ట్వీట్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హీరోయిన్ సమంత ఆసక్తికర ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ గురించి ఆమె చెప్పిన వర్డ్స్ అభిమానుల్లో మరింత ఆనందం నింపాయి. దీంతో పవర్ ఫ్యాన్స్ ఆమె ట్వీట్‌ను లైక్స్, కామెంట్లు, రిట్వీట్లతో ముంచెత్తారు.
'ప్రియమైన పవర్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు... నిస్వార్థంతో ప్రజలకు సేవ చేయడంలో మీరు ఈతరం యువతకు రోల్ మోడల్. మీ లాంటి వారిని చూసి మేము గర్వపడుతున్నాము' అని సమంత వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్‌తో కలిసి 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించిన సమంత అతడిని ఎంతో తగ్గర నుండి పరిశీలించి చాలా విషయాలు తెలుసుకున్నారు. ఆయనపై ఇష్టం, గౌరవం పెంచుకున్నారు. అందుకే పవన్ కళ్యాణ్‌కు సంబంధించిన ఏ విషయంపై అయినా స్పందించడంలో సమంత ముందుంటారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్, ఈసా రెబ్బ తదితర హీరోయిన్లు సైతం విష్ చేస్తూ ట్వీట్స్ చేశారు.
సమంత సినిమాల విషయానికొస్తే... ప్రస్తుతం ఆమె తెలుగులో 'యూటర్న్' మూవీ చేస్తోంది. ఈ చిత్రం తమిళంలో కూడా విడుదల కాబోతోంది. దీంతో పాటు తమిళంలో సీమరాజా, సూపర్ డిలక్స్ మూవీల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications











