Don't Miss!
- News Sujana Chowdary: ఎన్నికల వేళ సుజనా చౌదరికి షాక్..! రూ.500 కోట్ల రుణంపై...
- Finance Blood Bath: వారాంతంలో కుప్పకూలిన మార్కెట్లు.. బేర్స్ చేతిలో Sensex-Nifty..
- Technology Vivo V30e ఇండియా లాంచ్ తేదీ వివరాలు! లీక్ అయిన ధర, స్పెసిఫికేషన్లు
- Automobiles కేవలం రూ. 8,999లకే డ్యాష్‌క్యామ్.. ఈ BIS కెమెరా కార్లకు పెట్టుకుంటే చాలు!!
- Sports PBKS vs MI: అతను అసాధారణ బ్యాటింగ్‌తో భయపెట్టాడు: హార్దిక్ పాండ్యా
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
ఆటో డ్రైవర్‌కు సమంత సర్'ప్రైజ్.. ఒకేసారి 12లక్షల విలువ చేసే కానుక..
స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత పెళ్లి తరువాత కూడా అగ్ర హీరోయిన్ గా కొనసాగుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో గతంలో మాదిరిగా నటించకపోయినప్పటికి లేడి ఓరియెంటెడ్ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద తనకంటూ ఒక మార్కెట్ సెట్ చేసుకోవడం విశేషం. ఇక ఆమె నటనతో పాటు అప్పుడప్పుడు కొన్ని సామజిక సేవలతో కూడా ఆడియెన్స్ ను ఎక్కువగా ఎట్రాక్ట్ చేస్తుంటారు. ఇటీవల ఒక యువతికి ఏకంగా కారును కానుకగా ఇవ్వడం విశేషం.
ఒక చాలెంజ్
అక్కినేని వారి కోడలు అయిన తరువాత కూడా సమంత తన స్టార్ ఇమేజ్ ను ఏ మాత్రం తగ్గించుకోలేదు. రంగస్థలం లాంటి సినిమాలో ఆమె చేసిన పాత్ర నేటితరం హీరోయిన్స్ కు ఒక చాలెంజ్ అనే చెప్పాలి. ఎలాంటి సినిమా చేసినా కూడా పాత్రలో మ్యాటర్ ఉందా లేదా అనే విషయంపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు.
సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా
ఇక సమంత సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా కూడా తెరవెనుక ఎన్నో మంచి పనుల్లో తన వంతు సహాయం ఉండేలా చూసుకుంటారు. అయితే ఇటీవల కుటుంబాన్ని ఒంటి చేత్తో మోస్తున్న ఒక వీర మహిళ ధైర్యానికి సమంత ఫిదా అయ్యింది. ఆమె పడుతున్న కష్టానికి ఓ చిన్న కానుక అంటూ గుర్తుండిపోయే సహాయాన్ని చేసింది.
ఒక ధైర్యం అవ్వాలని
ఆ మహిళ వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లాకు చెందిన కవిత అనే మహిళకి బాల్య వివాహం జరిగింది. అయితే భర్త రోజు తాగొచ్చి కొట్టడంతో ఆమె పుట్టింటికి వచ్చేసింది. తన వల్ల కుటుంబానికి భారం కాకూడదని.. తనే ఒక ధైర్యం అవ్వాలని ఆమె వ్యవసాయం కూడా చేసింది.
ఆటోను నడుపుతూ
ఏడుగురు చెల్లెళ్ళని పోషిస్తూన్న సమయంలో సడన్ గా తల్లి దండ్రులు ఒకరి తరువాత మరొకరు చనిపోవడం చాలా కష్టమయ్యింది. దీంతో ఏ మాత్రం మొహమాట పడకుండా ఆమె ఆటో నడపడం స్టార్ట్ చేసింది. మియాపూర్ నుంచి బాచూపల్లి వరకు ఆటోను నడుపుతూ కుటుంబానికి అండగా నిలిచింది.
Recommended Video
ఖరీదైన కారును కానుకగా
అయితే అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఒక ప్రయివేట్ ప్రోగ్రాంలో ఆహ్వానం అందుకున్న ఆమె గురించి సమంత తెలుసుకున్నారు. వెంటనే ఆమెకు ఏదైనా సహాయం చేయాలని ఖరీదైన కారును కానుకగా ఇచ్చింది. 12.50లక్షల విలువైన స్విఫ్ట్ డిజైర్ కారును ఇటీవల కవితకు అందజేశారు. దీంతో కవిత సమంతకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.