సమంత సంచలనం.. ఫస్ట్ టైమ్ బికినీలో మైండ్ బ్లాక్ అయ్యేలా హాట్ స్టిల్.. వాళ్ళతో గోవా ట్రిప్!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో సంచలనంగా మారుతున్న సమంత మరో షాక్ ఇచ్చింది. గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె బికినీలో స్మైల్ ఇచ్చి కుర్రాళ్లను మంత్ర ముగ్దులను చేసేసింది. సాధారణంగా జెస్సి అలా స్మైల్ ఇస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఏకంగా బికినీ లాంటి డ్రెస్ లో స్టిల్ ఇస్తే ఇంకా ఏమైనా ఉంటుందా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో సమంత పోటో వైరల్ గా మారింది.

పెళ్లి తరువాత..
క్యూట్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న సమంత నాగచైతన్యతో పెళ్లి తర్వాత ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత కూడా వేగంగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళింది. ఒక విధంగా హీరోయిన్స్ పెళ్లి తర్వాత స్లో అవుతరానే కామెంట్స్ కు ఆమె చెక్ పెట్టింది అనే చెప్పాలి. అదే తరహలో గ్లామర్ తో హీటెక్కిస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తోంది.

భేదాభిప్రాయాలతో విడాకుల
ఇక నాగచైతన్యతో ఇటీవల పదేళ్ల బంధానికి తెగదెంపులు చేసుకున్న విషయం తెలిసిందే. ఇద్దరికి వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు రావడంతో వెంటనే విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే సమంత చైతు మాత్రం చాలా ఫ్రెండ్లిగానే విడిపోతున్నట్లుగా బయట ప్రపంచానికి చెప్పారు.

కెరీర్ పై ఫోకస్
ఇక సమంత విడాకులు తీసుకున్న తరువాత తన కెరీర్ పై ఇంకాస్త ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా కాకుండా కాస్త భిన్నమైన తరహాలో నడుస్తోంది. ముఖ్యంగా ఓటీటీ కంటెంట్ వెబ్ సీరీస్ లతో కూడా బిజీగా మారిపోయింది. వీలైనంత వరకు తను చేసే పాత్రలు కొత్తగా ఉండాలని ఆలోచిస్తున్నట్లుగా అర్ధమయ్యింది.

ఐటెమ్ సాంగ్
ఇక రీసెంట్ గా పుష్ప సినిమాలో సమంత చేసిన ఐటెమ్ సాంగ్ ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో ఎప్పుడు లేని విధంగా సమంత మొదటిసారి ఐటెమ్ సాంగ్ చేసింది. ఇక ఆ పాట కోసం ఆమెకు కోటిన్నర వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.

బిగ్ ప్రాజెక్ట్
సమంత ఎలాంటి సినిమా చేసినా అందులో ఎంతో కొంత కొత్తదనం ఉండేలా జాగ్రత్త పడుతుంది. ఆమె చేసిన పాత్రలకు ప్రేక్షకుల నుంచి ఎప్పటికప్పుడు పాజిటివ్ కామెంట్స్ అందుతూ ఉంటాయి. ఇక ఇప్పుడు కూడా అలానే ఉండాలని ఓటీటీ కంటెంట్ వైపు కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తోంది. ద ఫ్యామిలి మ్యాన్ మేకర్స్ తో వరుణ్ ధావన్ హీరోగా వస్తున్న మరో వెబ్ కంటెంట్ లో సమంత పవర్ఫుల్ పాత్రలో నటిస్తోంది.

బికినీలో షాకింగ్ లుక్
ఇక సమంత చాలా కాలం తరువాత ఒక ఘాటైన ఫొటోతో షాక్ ఇచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ గతంలో ఎప్పుడు లేని విధంగా ఆమె బికినీలో స్మైల్ ఇచ్చి కుర్రాళ్లకు షాక్ ఇచ్చింది. సాధారణంగా జెస్సి సింపుల్ స్మైల్ ఇస్తేనే ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక ఏకంగా బికినీ లాంటి డ్రెస్ లో స్టిల్ ఇస్తే మాములుగా ఉండదు. ఈ పిక్ పై నెటిజన్లు పాజిటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు.

స్నేహితులతో గోవాలో..
గోవాలో ఆ ఫొటో దిగినట్లుగా తెలుస్తోంది. తన స్నేహితులతో దిగిన ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సమంత విడాకుల అనంతరం ఎక్కువగా తన స్నేహితులతో విహార యాత్రలు చేస్తోంది. మనకు నచ్చిన విధంగా స్వేచ్ఛగా ఉండాలనే విధంగా కొటేషన్స్ కూడా ఇస్తోంది.


Click it and Unblock the Notifications











