Samantha ఫోన్ మోగుతూనే ఉంది.. కావాలనుకుంటే వెళ్లొచ్చు కానీ, అలా, బేబీ సీక్రెట్ రివీల్ చేసిన ఫ్రెండ్!

విడాకుల తర్వాత తన మీద జరుగుతున్నా దుష్ప్రచారం మీద సమంత ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా స్పందించిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఒక్కరొక్కరుగా సమంత సన్నిహితులు, అలాగే స్నేహితులు కూడా ఈ విషయం మీద స్పందిస్తున్నారు. సమంత చాలా మంచిది అని చెబుతూనే ఆమె పిల్లలను కనడం కోసం ప్రయత్నాలు చేసిందనే విషయాన్ని ఇప్పుడు వెల్లడిస్తున్నారు. తాజాగా పేరు చెప్పడానికి ఇష్టపడని సమంత స్నేహితురాలు ఒకరు కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకుంది. ఆ వివరాల్లోకి వెళితే

ఎట్టకేలకు నోరు విప్పి

ఎట్టకేలకు నోరు విప్పి

సమంత, నాగచైతన్య విడాకులు ప్రకటించిన ఆరు రోజుల తర్వాత అక్టోబర్ 8వ తేదీన తన గురించి జరుగుతున్న దుష్ప్రచారం మీద సమంత స్పందించింది. తన గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కానీ అది నిజం కాదని ఆమె చెబుతూ ఇలాంటి ప్రచారాలతో తనను ఎంతో బాధించడానికి ప్రయత్నిస్తున్నా సరే తను బాధ పడనని మీ పాచికలు పారానివ్వనని అంటూ ఒక ఎమోషనల్ నోట్ రాసుకొచ్చింది..

అనేక విశ్లేషణలు

అనేక విశ్లేషణలు

ప్రస్తుతానికి డైవర్స్ అనే ఒక బాధాకరమైన విషయాన్ని జీర్ణించుకునే పనిలో ఉన్నానని తనకు కాస్త సమయం ఇవ్వాలని సమంత కోరింది. అయితే పేరు చెప్పడానికి ఇష్టపడని సమంత స్నేహితురాలు ఒకరు ఒక ఆంగ్ల మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని కీలక విషయాలు పంచుకున్నారు. నిజానికి సమంత విడాకుల ప్రకటన వచ్చిన తర్వాత యూట్యూబ్ అలాగే ఇతర సోషల్ మీడియా వేదికలలో వీరి విడాకులకు కారణాలు అంటూ అనేక విశ్లేషణలు సాగాయి.

రిటైర్డ్ డాక్టర్ కూడా

రిటైర్డ్ డాక్టర్ కూడా


కొంతమంది యాంకర్లు అలాగే వివిధ వృత్తులకు చెందిన వారు ఒక రిటైర్డ్ డాక్టర్ కూడా సమంతదే తప్పు ఆమె పిల్లల్ని వద్దు అనుకుంది అందుకే ఈ విడాకులు జరిగాయి అంటూ రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అయితే ఈ ప్రచారం అంతా నిజం కాదని పేర్కొన్నారు సమంత స్నేహితురాలు. ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ రిలీజ్ అయిన తర్వాత సమంత ఫోన్ నిరంతరంగా మోగుతూనే ఉందని ఆమె చెప్పుకొచ్చింది.

కొన్ని వందల ఫోన్లు

కొన్ని వందల ఫోన్లు

ఆమె పెర్ఫార్మెన్స్ చూసి ఆమెకు ఆఫర్లు ఇచ్చే వాళ్ళు కొన్ని వందల సార్లు ఫోన్లు చేశారు కానీ సమంత వాటిని ఎత్తేది కాదని ఆమె వెల్లడించింది. ఎందుకంటే సమంత బేబీ కోసం ప్లాన్ చేస్తోందని ఆమె చెప్పుకొచ్చారు. నిజానికి ఆ సమయంలో సమంత కెరీర్ ముఖ్యం అనుకుని ఉంటే కనుక ఆ ఫోన్లు లిఫ్ట్ చేసి ఉండేదని అలా ముంబై వెళ్లి ఏం చేయాలనుకుంటే అది చేసేదని చెప్పుకొచ్చారు.

పిల్లలే ముఖ్యమని

పిల్లలే ముఖ్యమని


తనకు ఫ్యామిలీ ముఖ్యమని పిల్లలు ముఖ్యమని భావించి ఆ ఫోన్లు అన్నింటికీ దూరంగా ఉన్నా సరే ఇప్పుడు ఎందుకు మీడియా, సోషల్ మీడియా సమంతదే తప్పు అన్నట్లు టార్గెట్ చేస్తున్నదో తనకు అర్థం కావడం లేదని ఆమె వెల్లడించారు. ఇక ఈవిడ మాత్రమే కాక శాకుంతలం సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న గుణశేఖర్ కుమార్తె నీలిమ కూడా సమంత పిల్లలు కనాలని అనుకున్న విషయం గురించి వెల్లడించారు.. సినిమా కథ చెప్పినప్పుడే తనకు కథ నచ్చింది కానీ జూలై, ఆగస్టు నెలలో షూట్ పూర్తి చేస్తాను అంటేనే నటిస్తానని ఆమె చెప్పిందని మేము కూడా మాట ఇచ్చినట్టుగానే షూటింగ్ పూర్తిచేశామని ఆమె వెల్లడించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X