మొన్న అలా నేడు ఇలా.. తలకిందులుగా వేలాడుతోన్న సమంత

సమంత ప్రస్తుతం లాక్ డౌన్ సమయాన్ని ఎంతో చక్కగా వినియోగించుకుంటోంది. అందంతో పాటు ఆరోగ్యంపైనా దృష్టి పెట్టింది. అందుకే స్వయంగా రంగంలోకి దిగి సేంద్రియ వ్యవసాయం చేస్తోంది. ఇంటిపైనే ఓ వ్యవసాయ క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకుంది. రసాయనిక ఎరువులు వాడకుండా సహజ సిద్దంగా కూరగాయలను పండిస్తూ.. వంటలు వండటం కూడా నేర్చేసుకుంటోంది. ఈ మేరకు సమంత చేసిన వంటకాలు, తాను పెంచుతున్న మొక్కలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

ఇక ఈ లాక్ డౌన్ సమయాన్ని భార్యభర్తలిద్దరూ ఎంతో సరదాగా వాడుకుంటున్నారు. ఇద్దరూ కలిసి ఫిట్ నెస్‌పై బాగానే శ్రద్ద వహిస్తున్నారు. యోగా చేస్తూ కొత్త కొత్త ఆసనాలు వేస్తున్నారు. అంతే కాకుండా ఇంటి నుంచే యాడ్స్ షూట్స్ కూడా చేసేస్తున్నారు. ఏరియల్‌కు సంబంధించి సమంత షేర్ చేసిన ఫోటోలు, పెట్టిన క్యాప్షన్ తెగ వైరల్ అయింది. క్యూట్ కపుల్స్ అంటూ నెటిజన్లు ఆ ఫోటోను చూసి ముచ్చటపడ్డారు. తాజాగా సమంత తలకిందులుగా వేలాడుతున్న ఫోటోను షేర్ చేసింది.

Samantha Yoga Up and Down Pics Goes Viral

ఆ మధ్య సమంత జిమ్‌లో ఎంతగా కష్టపడిందో అందరికీ తెలిసిందే. వంద కేజీల బరువును కూడా అవలీలగా ఎత్తేసింది. సమంత ఏదైనా మొదలుపెడితే మధ్యలో వదిలేసే రకం కాదు. అవి యోగా ఆసనాలైనా, జిమ్నాస్టిక్స్ అయినా, వంటలైనా సరే. మొన్న గాల్లో తేలిన ఆసనాన్ని షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా తాళ్ల సాయంతో తలికిందులుగా వేలాడుతున్న ఫోటోను షేర్ చేసింది. సమంత ఫ్రెండ్ శిల్పా రెడ్డికి కరోనా రావడంతో అందరూ భయాందోళనకు లోనయ్యారు. సమంతకు కూడా కరోనా సోకిందనే వార్తలు వట్టి రూమర్స్‌ అని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X